- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఇక్కడ కవిత్వం
అలంకారప్రాయం కాదు
ఇక్కడ కవిత్వం
మందుపాతరల విస్ఫోటనం
డ్రోన్లతో జల్లెడపట్టి
తుపాకుల దువ్వెన తిప్పి
చెట్టు చెట్టును కూల్చేస్తావు
రేపటికల్లా మళ్ళీ చిగురిస్తుంది
అరణ్య గర్భాన్ని చీల్చి
ఖనిజ సంపదను పోగేసి
అయినవాళ్ళకు అప్పగించేవు
కాని అది భగ్గునమండే ఖనిజం
వెంటాడి, వేటాడి, వెతికి వెతికి
మనుషులను మట్టు పెట్టావు
విస్తరించిన శ్వాసను
ఏం చేయగలవు
కన్నీట విరుస్తున్న
సింగిడినేమి చేయగలవు
పొందూరు శ్రీనివాస్
- Tags
- Poem
Next Story






