- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పార్కులోని బెంచి
మా మిత్రుత్వాన్ని పిలుస్తుంది
రహస్యంగా కన్పించి మౌనంగా
మేమాడే మాటల్ని రికార్డ్ చేస్తుంది
ఏళ్ల కొద్దీ మగ్గిన అత్తరులాంటి
స్నేహానికి సాక్ష్యం ఆ బేంచి
ఆలోచనల్లో సారుప్యంతో
గుసగుసల గుభాళింపుల్ని
ఊసుల పరిమళాల్ని ఆస్వాదించి
ఎండకి వానకి పాడైన ఆ బెంచి అంటే
మాకు చాలా ఇష్టం.
నెలైంది కనపడకపోయేసరికి
రమ్మని కబురు పెట్టింది
చైతన్యశీల భావాలతో
యవ్వనంలోకి ప్రవేశించి
సమున్నత ఆదర్శాలతో
వృత్తి జీవితాన్ని ముగించి
వ్యక్తిత్వ ఔన్నత్యంతో
సంపూర్ణంగా వికసించి
వీళ్ళకి పనిపట్రాలేదని
కాలం కుట్ర చేసిందని
ఎవరు చెప్పెదరు ఆ బెంచికి
- కోటం చంద్రశేఖర్
94920 53348
- Tags
- Poem
Next Story






