- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
గాలి గట్టిగా వీచి
ఇంటి తలుపులు తెరుస్తుంది
వాన చిన్న చిన్నగా వచ్చినా
వచ్చి పలుకరించి పోతుంది!
సూర్యుడు పొద్దంతా ఇంటిలోనే
రాత్రంతా చంద్రుడు
తొంగి చూస్తూనే ఉంటాడు
పలుకరించకున్నా, పిలువకున్నా!
పొయ్యిలో పడుకున్న పిల్లి
నిద్దుర లేవనేలేదు
నా తల్లి అన్నపూర్ణ అనే పాట
మారుమోగుతోంది స్వాతంత్ర దినాన!
అన్నమో రామచంద్రా అంటూ
మనసు మౌనంగా పాడుతుంది
ఖాళీ కడుపుతో
కళ్ళు తిరిగి సొమ్మసిల్లితే
రంగులు కనిపిస్తున్నాయి!
ఆ రంగులకు అర్థం
ఆ పేద పౌరుడికి తెలుసా?
ఎంగిలి మెతుకుల కొరకు
ఎదురు చూసే బతుకులకు
పింగళి వెంకయ్య తెలుసా?
జగ్గయ్య.జి
98495 25802
- Tags
- Poem
Next Story






