- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
పొద్దు పొద్దున్నే
బంగారు వన్నె పిల్ల
తూర్పు ద్వారం
తెరుచుకొని
గాలి మెట్లు దిగి వచ్చి
భూమి కప్పుకున్న
చిక్కటి చీకటి
దుప్పటిని లాగేసింది
లోకానికి బంగారు
స్నానం పోసి మత్తు
నిద్ర నుంచి లేపి
ఆటలు ఆడుకుంది
ఆడి ఆడి అలసిపోయి
సాయంత్రం అవగానే
పడమర ద్వారం వైపు
గాలి మెట్లు ఎక్కి
ఇంటికి వెళ్లి
తలుపులు మూసుకుంది
దాకున్న చీకటి తను
వెళ్ళంగానే వచ్చి
లోకానికి తన దుప్పటి కప్పి
మత్తు నిద్ర పోసి జోకొడుతూ
మరల నిద్రపుచ్చింది
గుండెల్లి ఇస్తారి
98499 83874
- Tags
- POEM
Next Story






