మనుషులను నియమించండి

by Ravi |   (  Updated:2024-08-25 18:45:24  IST  )

Poem

మనుషులను నియమించండి
X

ఈ దేశాన్ని నిలబెట్టడానికి

పోలీసులు, డాక్టర్లు, ఇంజనీర్ల కంటే ముందు

మనుషులను నియమించండి

మానవత్వం కొలిచే మాపకాలు

ఏవైనా ఉంటే ముందు కనిపెట్టండి

కొండలను కరిగించైనా

ఇసుకను జల్లించైనా

సముద్రాన్ని మదించైనా

నదులను వడకాచైనా

మానవత్వం పాలు ఏమైనా

దొరుకుతాయేమో శోధించండి

దొరికితే...

తలా గుల్లడు పట్టి

మనుషులుగా మార్చండి

లేదంటే ...

తల్లి కడుపున పుట్టామనే

నిజమైనా గ్రహించమని చెప్పండి.

- వినోద్‌ కుత్తుం

96343 14502

Next Story