- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జింకల దూప
సముద్రాలు ఎడారులై
ఎడారులు సముద్రాలయ్యే కాలం
ఇసిరి కొడుతున్న వానలా వస్తుందని
వేపచేట్టుకింద తాత చెప్పిన కథ
సత్యమైంది.
నరాలు తెగేట్టు నినాదాలిచ్చి
నెత్తురు చిమ్మెట్టు గాయాల
వాగులై పోరాడితే
ఇప్పుడేం మిగిలింది
కళ్ళముందు కుక్కలు నాకినంక
మిగిలిన విస్తరాకులు.
కొడుకు జైలుకెళ్ళినా
పాచి బువ్వతిన్నా
బతుకు బంగార మౌతదని,
పెయిమీద లాఠీ ముద్రలు వెక్కిరిస్తున్నా
కండ్ల గిన్నెల్లోనే దుఃఖాన్ని దాసవెట్టి
ఎదురు సూస్తే
చేతికచ్చినయి సొంతింటి బేడీలు
పాలబర్రెను, పుస్తెల తాడును
మార్వాడి చేతులవేట్టి నీళ్ళారగిచ్చి
కొడుకును కోచింగుకై
పట్నం పంపించిన తల్లికి
నెత్తిమీద నిట్టాడి ఇరిగిపడ్డ సప్పుడు.
రేపో మాపో అనే నానవ్వ
సావుదారిని సప్పరిస్తున్న బాపుతండ్రి
వేసవి చెరువులా నేర్రెలిచ్చిన
చెట్టంత మనుమని మొఖంచూసి
దోతి శెంగులు నిండిన దుఃఖం
ఆరుపదుల పురిటినొప్పులు భరించి
తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్ర్ంను ప్రసవిస్తే
ఈడ్చు కెళ్ళ ఎదురు చూసే
నక్కల మంద.
చారెడు మెతుకుల కోసం
బతుకంతా పరుగు పందెంలో
అందని ఎండమావులకై
సొమ్మ సిల్లిన అమాయక జింకల పరుగు
గండుపిల్లి మహా నటనకు
పక్షి పిల్లలు మోసపోవడం .
జిత్తుల నక్క సుతి మెత్తని పొగడ్తలకు
పిచ్చికాకి ముక్కను వదులు కోవడం
పుట్టను వదులు కుంటున్న చీమల బతుకు
కళ్ళంను దళాళ్ల చేతుల వెట్టి
గుడ్లప్ప గిచ్చి చూస్తున్న నాగలి దైన్యం
అందరూ ఒక్క సారిగా
నిద్ర మత్తు రెప్పల్ని దులిపి
కొత్త దారిపై ఉత్తెజపు చూపులు నాటుతూ
ఎదురెదురుగా నడుస్తూ నడుస్తూ.
ఉరుకుతూ ఉరుకుతూ…..
డా. ఉదారి నారాయణ
94414 13666
- Tags
- Poem