- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మా నల్ల బట్ట మచ్చల కుక్క
ఐదు వారాల క్రితం
ఐదు పిల్లల్ని ఈనింది
వాటిలోంచి ఏ మచ్చా లేని
ఓ తెల్ల కుక్క పిల్లను ఎంచి..
మా వాగ్దేవి మాస్టారు
కొత్తగా కట్టుకున్న ఇంటికి
కాపలా ఉంటుందని
కానుకగా ఇచ్చాను
ఆ తర్వాత
మా నల్ల బట్ట మచ్చల కుక్క
తప్పిపోయిన తన పిల్లను గుర్తుపట్టి
రోజూ మా పేటలోంచి
ఓ మాంసపు ముక్కని తీసుకెళ్లి
మాస్టారు ఇంటిముందు
నిలబడుతూనే ఉంది
పాపం! ఆ కుక్కపిల్ల
తల్లిని చూసి
వాగ్ధేవి మాష్టారు ఇంటి
ప్రేమలేని శ్లోకాలలోంచి
ఎదురుగా ఉన్న
మాంసం ముక్కను
అందుకోలేక శోకిస్తుంది
-- రాం
94404 34880
- Tags
- Poem
Next Story






