- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఎన్నికల ఫలితాలొచ్చాయి..
రాజకీయం అసలు రూపు బయటపడేదిప్పుడే
మనం ఆశించినంత మార్పులేం
జీవితాల్లో వుండవు
సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు
అవే గతుకుల రోడ్లు, అవే అవినీతి బాగోతాలు
రంగుల కల చెదిరినట్టూ.. ఇంటర్వ్యూ బాగా
చేసినా ఉద్యోగం ఎందుకు రాలేదో అర్థం కానట్టూ
వెయ్యి అబద్ధాలాడి ఒక పెళ్లి చేసినట్టూ ఉంటుంది
గారడీవాడు వెళ్లిపోయేక కలిగే
విస్మయం లాంటిది కలుగుతుంది
నీటి చెలమే అని నమ్మింది కూడా ఎండమావే
అనేసరికి తట్టుకోలేం
మన కష్టాలు కన్నీళ్లు మనని వదల్నే
వదలనంటాయి
మన పేదరికానికీ, ఫలితాలకీ సంబంధం లేదని
తెలిసి బాధేస్తుంది
ఎన్నికల తెరముందు మెరిసిన రంగులన్నీ
తెరవెనుక కరిగిపోతుంటే
నిరుత్సాహం మిగులుతుంది
ఓడిపోయిన వాళ్లమీద జాలి వేస్తుంది
నెగ్గిన పార్టీ ఓడిన పార్టీ ఒక్కటే అని తెలుస్తుంది!
జెండాలు అజెండాలే అటూఇటుగా
మార్చుకొన్నారని తెలిసి అవాక్కవుతాం!
మన చిన్న బుద్ధికి పెద్దగా చింతిస్తాం
ఐదేళ్ల మూడు ముక్కలాటలో మళ్ళీ బొక్క
బోర్లాపడ్డామని మనమే ఒప్పుకుంటాం..!!
- భీమవరపు పురుషోత్తమ్
99498 00253
- Tags
- Poem






