పదునెక్కిన ఆలోచన

by Ravi |   (  Updated:2024-06-09 18:45:43  IST  )

poem

పదునెక్కిన ఆలోచన
X

ఒక్కసారి చేసిన తప్పుతో

ఐదేళ్లు పాలనతో

వందేళ్లు వెనక్కి తీసికెళ్ళిన

నిరంకుశత్వ పాలనలో

అధికారం చేసిన మోసాన్ని కనిపెట్టి

అహంకారమాడిన నాటకాలకు తెరలాగి

రాక్షసత్వం చేసిన గారడిని పసిగట్టి

అంధకార పాలనకు అడ్డుకట్టవేసి

నోరు లేని బలహీనులెందరో

బలం లేని బడుగుజీవులెందరో

మోసపోయిన వేతన జీవులెందరో

అణగతొక్కబడ్డ ఆశాజీవులెందరో

నలిగి నలిగి రగిలిన సామాన్యుడు

ఓపికపట్టి, ఊపిరి బిగపట్టి,

బుద్ధి బలంతో ఓటు "బటన్ నొక్కి"

నేడు చెప్పిన తీర్పుతో

పదునెక్కిన ప్రజల ఆలోచన

ఆచరణలో ముందుకొచ్చి

ప్రజాస్వామ్య బలం గెలిచింది.

ఓటు విలువ లోతు తెలిసింది

-చందలూరి నారాయణరావు

97044 37247

Next Story