ముఖచిత్రం

by Ravi |

Poem

ముఖచిత్రం
X

పదేళ్ల స్వేచ్ఛ గజానికి

ప్రజాపాలన అంకుశమయ్యింది

ఉచితాల ఉరులు బిగించి

సామాన్యుల లాలసను

ఆసరా చేసుకుని

స్వలాభ పంటలు

పండించుకున్నారు

హక్కుల ధిక్కార స్వరాలు

లలిత సంగీతం అనుకున్నారు

ఓటమి చవిచూసేదాక

తెలిసి రాలేదు

చేపకు ఎర రహస్యం

తెలిసినపుడు

గాలానికే కోతపెడుతుంది

పదేళ్ల వసంతంలో

కోకిల కాకి అయ్యింది

పోరాటల్లో ఆరితేరిన జనం

వెన్ను పోటుల ఉనికి

తెలిసిన జనం

మళ్లీ కొత్త దారులు

మళ్లీ కొత్త పరుగులు

తెలంగాణ పోరాటాల నేల

ఓడినా గెలుపు దాకా పోరాడే నేల

ఎత్తుపల్లాలు చూసింది

వసంతాలను చూసింది

రేడియమ్

92915 27757

Next Story