- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఈ పగటి సంధ్యలో
గట్టిగా ఎవ్వరూ మాట్లాడలేక పోవచ్చు
పబ్లిగ్గా ఎవ్వరూ ప్రశ్నించలేకపోవొచ్చు
బహిరంగంగా ఎవ్వరూ
కలలు కనలేకపోవొచ్చు
కలల్లో వణుకుతూ
వాస్తవాల్లో వణుకుతూ
బెరుకుకి పిరికిమందు వేసి
నడుస్తూ నిద్రపోయేవాళ్ళే
అందరూ కావొచ్చు
ఏ సుడినీ ఖాతరు చేయని
ముసిడికొయ్య లాంటి
మొరుడొకటి కూడా వుంటుంది!
వరదను ధిక్కరిస్తూ, బురదను చీలుస్తూ
తలెత్తి లేచే గడ్డిపరకలా
తుపాను తీరంలో
ఎదురేగి నిలబడుతుంది
ప్రశ్నించే గొంతుకగా
ఒక నిక్కచ్చి కవితా వాక్యం!
- కంచరాన భుజంగరావు
94415 89602
- Tags
- Poem
Next Story






