ఎన్నాళ్లు మూగ భాష

by Ravi |   (  Updated:2024-04-14 18:30:26  IST  )

Poem

ఎన్నాళ్లు మూగ భాష
X

నాలో దాగిన

చుట్టూ తిరిగే మౌనగీతం

ఓ రాత్రి నరాలు తెగేలా మాట్లాడుతుంది!!

ఒంటరిగా ఉన్నప్పుడు

నా చాయ వెక్కిరిస్తుంది

అలంకరించుకొని అందంగా

ముస్తాబు ఎప్పుడైతావని!!

మొద్దు బారిన మెదడు

ఆలోచనతో నిద్రను ఆపుతుంది

నాకు ఇంకా నీ జవాబు ఇవ్వలేవా అని!!

నా కలకు కన్నీలొస్తున్నాయి

నీవు ఎప్పుడూ కలలు కనమాకంటూ..

నన్నొదిలి నా ఆత్మ పోతానంది

నీవు ఎప్పుడూ నన్ను బయట

తిప్పవుగా అంటూ

నేను కదలించలేనని నా నాలుక

కటువైన నిజాల్ని కక్కుతానంటూ

విరుచుకుపడుతూ..

ఎన్నాళ్ళు ఈ మౌన పోరాటం

ఇంకా ఆపవుగా అని ప్రశ్న వస్తే

గాయపడ్డ నా దేహం చెబుతుంది

కంగారు పడకండి

నా మౌనం ఎప్పుడూ అంగీకారం కాదు అని!!

- అనిత చరణ్

94945 79069

Next Story