- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అలారం లేపితే కానీ
నిద్రలేవని అలవాటు
తడితే కానీ తలుపులు
తెరువని తనం!
కాళ్ళు అరిగితే కానీ
కదలని ఫైళ్లు ఆఫీసులో
కోర్టు తీర్పు చెబితే కానీ
తీరు మారని ప్రభుత్వాలు!
సిగ్నల్లు లేకపోతే
ట్రాఫిక్ కదలని సిస్టమ్!
అల్సర్ వస్తే కానీ ఆహారపు
అలవాట్లు మార్చుకోని మనం!
దైవం లాంటి తల్లిదండ్రులను
చూడలేని దైన్యం
పిల్లలు పెరిగాక కానీ
తెలిసిరాని వైనం!
చచ్చాక
పిలవకున్నా వచ్చే నలుగురు!
అప్పుడు తెలిసి వస్తే
ఏమి వస్తుంది....?
జగ్గయ్య.జి
98495 25802
- Tags
- poem
Next Story






