జాగ్రత్త! జాగ్రత్త!!

by Ravi |

poem

జాగ్రత్త! జాగ్రత్త!!
X

మొంటెడు చేపలు తిని

ఏమీ ఎరుగనట్టు ముఖం పెట్టి

పిలువని పేరంటానికి

పిల్లి జల్ది జల్ది వస్తున్నది

ఆవు తోలు కప్పుకొని

ఆవురావురంటూ

తీసివేయంగా ముసిలితనం

పులి గాండ్రించక వస్తున్నది

ఎగ్గు లేదు సిగ్గు లేదు

చేసిన పనికి చింతలేదు

మంచి చెడ్డ వంతన లేక

కండువా కప్పుకొని

దండిగా దోసినోనికి

అండగా నిలుచుంటానని

ఊసరవెల్లి నవ్వంగా

రాజకీయ రాక్షసుడు

రాజసూయ యాగం చేస్తున్నాడు

-జూకంటి జగన్నాథం

94410 78095

Next Story