జీవితమంటే..

by Ravi |

poem

జీవితమంటే..
X

జీవితమంటే..

సుఖ సంతోషాల కల్పతరువు

పాలవెల్లి వెలుగులాగ..

జీవితమంటే..

వెలుగు నీడల కూడలి

రేయింబవళ్ళ భ్రమణం లాగ..

జీవితమంటే..

ఎత్తుపల్లాల పల్లెరోడ్డు

తూగుటుయ్యాల తల్పం లాగ..

జీవితమంటే..

వ్యామోహాల చిచ్చుబుడ్డి

వడలిపోయే యవ్వనం లాగ..

జీవితమంటే..

ఆకర్షణల మల్లెలవాన

మత్తకోయిల ఈల పాటలాగ..

జీవితమంటే..

సంతోషాల రంగుల హరివిల్లు

పురివిప్పిన మయూర నాట్యంలాగ..

జీవితమంటే..

అనురాగ బంధాల అల్లిక

అన్యోన్యపు సంసారం లాగ..

జీవితమంటే..

విభిన్న పాత్రల కలయిక

రంగస్థల విన్యాసం లాగ..

జీవితమంటే..

సమస్యలతో నిత్యం సమరం

ఓటమి ఎరుగని వీరుని లాగ..

జీవితమంటే..

ఆకు పచ్చని సంతకం

వసంతాగమన శోభితం లాగ..

జీవితమంటే..

సుఖదుఖాల సంగమం.

ఉగాది పచ్చడి రుచులకు లాగ..!

యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Next Story