- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఇవాళంతా ఆ మట్టి రంగమ్మాయి
గురించే రాయాలనుంది.
రేపైతే మళ్ళీ గాజు కళ్ల పిల్లను రాసుకోవాలి.
ఎక్కడో ఓ చోట
రోజూ నాకు ముక్కలవుతున్న
ఆడపిల్లల మనసులు
ఎదురవుతూనే ఉంటాయి.
ఆ అమ్మాయిల రక్తపు చారికలు
గొంతుపై గోర్ల బరకలు
నా పగటి కలల్ని కూడా
ఆక్రమించుకుంటాయి.
వాటిని రాసే పనిలో నేను
అలా కూర్చుంటానో లేదో
అనామక చెయ్యేదో నా...
చనుమొనలను మీటుతూ ఉంటుంది.
ఇక ఆ మట్టి రంగు అమ్మాయిని,
గాజు కళ్ల పిల్లను నేనే అవుతాను
వాక్యం అలా...
కొనసాగుతూనే వుంటుంది !!
- శ్రీనిధి విప్లవశ్రీ
- Tags
- poem
Next Story






