- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

కాలుపెట్ట సందు లేదు. బుంగి బైక్ ను ముందుకు పోనిచ్చాడు. అది పోవడం లేదు. అది నాలుగు రోడ్ల కూడలి. విశాలమైన నాలుగు రోడ్లు జనాలకు జన్మనిచ్చినట్లున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. థియేటర్స్, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్స్, టెంపుల్స్ అన్నీ అమరి ఉన్న కూడలి అది. నిత్యం రద్దీగా ఉండే స్థలం. ఆ రోజు మరింత రద్దీగా ఉంది. పాదచారుల సంఖ్య ఎక్కువగా ఉంది. మామూలుగా అక్కడ వెహికల్ పార్కింగ్ కష్టం. ఆనాడు అవకాశమే లేకుంటయింది. ఆ రోజు శనివారం. షాపులలో గిరాకీ తక్కువగా ఉంది. కిరాణా కొట్లు వెలవెలబోతున్నవి. అక్కడ అంగడి కొలువుదీరింది. చింత, మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి లాంటి మరిన్ని వంట సరకులు రోడ్లపై కుప్పలుగా ఉన్నవి. తక్కువ ధరలతో ఆహ్వానిస్తున్నవి. బనియన్స్, కర్ఛిఫ్, షర్ట్స్, ప్యాంట్స్ రాసులుగా పోశారు. పక్కనే ఉన్న క్లాత్ స్టోర్ లోని నిలువెత్తు బొమ్మలు (మ్యానిక్యూమ్స్) నోళ్లు తెరిచాయి. కత్తిపీట నుండి కడవ దాకా, గింజ ధాన్యం నుండి పాల ఉత్పత్తుల వరకు అన్నీ పేర్చి ఉన్నాయి. పిల్లలకు ఆట బొమ్మలు, బొమ్మలకు చేతికర్రలు, అమ్మలకు వెదురు బుట్టలు, నాన్నలకు కాలిజోళ్లు, తాతలకు కళ్ళజోళ్లు ఇలా సమస్త వస్తువులు కుదురుగా కుదురుకున్నవి.
చుట్టు పక్కల పల్లెల నుంచి అమ్మకానికి వస్తువులు వచ్చాయి. కొనడానికి మనుషులు వచ్చారు. పొద్దంతా పల్లె ప్రజలు, సాయంత్రం నగరవాసులతో రోడ్లు కిటకిటలాడాయి. వాహనాల రొదలు, అమ్మేవారి అరుపులు, కొనేవారి కొసరుడు, ఆత్మీయుల పలకరింపులు, టీనేజర్ల దొంగచూపులు, ప్రేమికుల ఎదిరిచూపులు, ముష్కరుల ముష్టిఘాతాలు, దొంగల హస్తలాఘవాలు, బలాదూర్ తిరుగుళ్లు, నోరూరించే తిరుగుళ్లు అంతా అంగడంగడి. అదొక క్రమత, సమత,మమతల మేళవింపు. జీఎస్టీ దెబ్బలు, గ్యారంటీ బొబ్బలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, ఎక్స్ పయిరీల గోల లేని అమాయక సంత. హైటెక్ వ్యాపారానికి ఒక రోజు విశ్రాంతి నిచ్చే ఆకాశ పందిరి. ఆ రోజు మాయబజార్ల, చీకటి బజార్ల పప్పులుడకవు. వలపోత-పులకరింత, సమస్య పరిష్కారం, కష్టం-సుఖం కలబోసుకునే మానవీయ దర్బార్. అంగడి బజారు.
అంగడి మనల చల్లగా ఆదరించు
సంత వర్తక లక్షణం సంతరించె
మానవీయ ఇంచుక మరచిపోక
కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము
డా. బీవీఎన్ స్వామి
92478 17732
Also Read...
- Tags
- poem






