- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మి మనం ఓటు ఎందుకు వేస్తాం..? - ఉచిత పథకాలు
ఎన్నికల రోజులు మా పేదరికాన్ని అత్యంత నగ్నంగా ప్రదర్శిస్తాయి!

అమ్మి మనం ఓటు ఎందుకు వేస్తాం..? - ఉచిత పథకాలు
*
ఎన్నికల రోజులు మా పేదరికాన్ని అత్యంత నగ్నంగా ప్రదర్శిస్తాయి!
మునియా వాళ్ళ అమ్మకి నెలకి పన్నెండు వందల రూపాయల ఉచిత లక్ష్మీ బండార్ పథకం,
మునియా వాళ్ళ నాన్నకి సైకిల్,
మునియాకేమో బడిలో వేసుకోవడానికి ఉచిత బట్టలు!
ఇవే కదా వీళ్ళకి కావలసినవి
*
కానీ మునియాకి ఏం కావాలో,
ఎన్నికల్లో రాజకీయ లక్ష్యాలని ప్రకటించే నాయకులకి ఎప్పటికీ తెలియదు.
శిథిలమైపోయిన స్కూల్ భవనాలు ఇప్పుడు మేకలకి రక్షణ శిబిరాలుగా మారాయి.
ఫ్యాక్టరీ లోని నేలపై కట్టిన చెక్క వేదికల మీద ఎలుకలు అత్యం త ఉత్సాహంగా పరిగెడతాయి.
నాయకులు మాత్రం, పుంఖాను పుంఖాలుగా ఉచిత పథకాలు ప్రకటిస్తూ నిరుద్యోగుల ఉద్యోగాలు బొక్కేస్తూ ఉంటారు!
అందుకే మునియా వాళ్ళమ్మని "అమ్మీ మనం ఓటు ఎందుకు వేస్తాం?"అని.
అమ్మీ దగ్గర జవాబే లేదు!
- మోమితా ఆలం ఇంగ్లీష్ కవిత
తెలుగు అనువాదం గీతాంజలి






