- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతితో పెనవేసి కవిత్వం
'మనలోని పూల మానసాలు' కవితా సంపుటిలో పువ్వులను ప్రతీకగా తీసుకుని జీవితం, ప్రేమ, కరుణ, తల్లి, ప్రకృతి, మానవ సంబంధాలు, తాత్వికతను హృదయాన్ని తాకేలా ఆవిష్కరించిన ఈ తెలుగు కవితా సంపుటి విశేషాలపై విశ్లేషణ..

పువ్వులాంటిది జీవితం కూడా ..జాగ్రత్తగా మలుచుకోకపోతే వాడిపోతుంది ...మూడు కాలాలు లాగానే కర్మ /కష్టం వెంట వస్తు ఉంటాయి ...దాటుకుంటూ రావాలి మరి… ఉద్యోగరీత్యా విదేశాలలో ఉన్న తెలుగువాసి తన జీవితపు అనుభవాల్ని పువ్వులాంటి అక్షరంతో ప్రపంచానికి తెలియజేస్తే అదే "మనలోని పూల మానసాలు " అవుతాయి ...
జీవితం అందరికి వడ్డించిన విస్తరి కాదు కానీ ఎదురుకొనే క్రమంలో అనుభవించిన సంఘర్షణ ఈ కవిత్వం. చాలా చోట్ల కరుణ శ్రీ గారి పుష్ప విలాపం గుర్తుకు తెస్తుంది. |మనలోని పూల మనసాలు " లో ఎంత అద్భుతమైన వాక్యాలు కట్టిపడేస్తాయి . "కొందరు మనుషులు వెళ్లిపోయాకే/వాళ్ళ పరిమళం ఎంత పెద్దదో తెలుస్తుంది " గొప్ప మాట ...నిజమే చాలామంది మహనీయుల గురించి ఇది...ఇంకా ఒక తాత్వికత పరిమళం అలా మనల్ని తాకుతుంది ఇలా , "మనిషి పుడుతున్నప్పుడు పూలే /వెళ్తున్నప్పుడు కూడా పూలే " వాహ్ ...నిజం పుట్టినప్పుడు మనం పిల్లల్ని బారసాలకి పూలు వాడటం/అలాగే చావుకి కూడా పూలని వాడటం చూస్తాం ...
మనుషులమంతా గుల్దస్తా
పూలు పూసే సమయం నుంచి రాలిపోయేవరకే జీవితం ..ఈ మధ్యలోనే మనం మంచిగా ఉండాలని భావన. ఇంకో చోట అంటారు ...మనుషులమంతా గు ల్ద స్తా అని ...ఎందుకంటే , మనిషి లోపలనుంచి బాగుండాలి అంటే అత్తరు కాదు చల్లాల్సింది , కొంచెం ప్రేమ /కొంచెం కరుణ /మరికొంత మనసు ...ప్రేమ కరువైన నేపధ్యం లోనే కదా ఈ హత్యలు /ఆత్మహత్యలు ...అదే నేర్చుకుంటే "వెళ్ళిపోయాక కూడా మనసు లో పరిమిళం గా మిగులుతాము. ఈ చిన్న పుస్తకం లో వైఖరి అంటే చెప్పే టోన్ అంతా పువ్వుల చుట్టూ నే తిరుగుతుంది ..కవయిత్రి ఇక్కడ వైయుక్తిక ప్రతీకలని వాడారు ...దాని కి పువ్వులు చెట్ల ని ఎంచుకోవడం విశేషం ...నాకు చాలా నచ్చిన విషయము ఏమిటి అంటే ఈ పువ్వులతో మనుషుల మనస్తత్వాల్ని , జీవిత తాత్వికత ని చెప్పడం ...
పూసినప్పుడల్లా ఇంట్లోకి వచ్చేది అమ్మే
"అమ్మ పువ్వు" కవితలో అంటారు "వాళ్ళకి తెలుసా ఈ చెట్టు పూలు మాత్రమే కాదు /పూసినప్పుడల్లా ఇంట్లోకి వచ్చేది అమ్మే అని ...ఆ ఇంటితో అమ్మకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు ...సకురాలు లో దారంతా పూల వసంతాలు /జీవితం లో కొన్ని అందాలు ఎక్కువ కాలం ఉండవు " ఎంత తాత్వికత నిండిన ఆలోచన ..నిజమే ఆనందాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి కదా ...అయితే మళ్ళీ ఆశావహ దృక్పధంతో " కానీ, అందంగా పూయడాన్ని నేర్పిస్తాయి |" అని లైఫ్ లో ఆప్టిమిస్టిక్ గా ఉండమని నేర్పిస్తుంది....
అడుగు అడుగునా పూల మరిమళం
నాలుగు భాగాలగా విభజించిన ఈ కవిత్వంలో మనకి అడుగు అడుగునా పూల మరిమళం తాకుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతాయి అయితే వాటిని మనం ఎలా తీసుకుంటాము అనేది ముఖ్యం .. విజయ నాదెళ్ల గారు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని అక్షరం చేయలేదు కానీ ...మలుపు తిప్పిన ఎన్నో ఘటనలని, వస్తువులతో ఇంకా ఎక్కువగా చెట్లతో, ప్రకృతితో తనకున్న మమకారాన్ని అక్షరాల్లో నింపి మనకి గుల్డాస్తాగా బహుమతి ఇచ్చారు...చాలా చోట్ల మనకి కరుణశ్రీ పుస్ప విలాపం గుర్తుకు వస్తుంది ...అయినా మంచిదే కదా అలా అయినా వారిని స్మరిస్తున్నాం ..
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే విజయ కవిత్వంలో ఇప్పుడే అడుగు పెట్టారు. కవిత్వంతో ప్రయాణం మరింత ముందుకు సాగాలని ఆశిద్దాం.
పుస్తకం: మనలోని పూల మానసలు
రచయిత్రి : నాదెళ్ల విజయ
వెల : రూ.300
ప్రచురణ : అచ్చంగా తెలుగు
పేజీలు : 50
పరిచయం
-పుష్యమీ సాగర్
79970 72896






