మొహింద లోయలో 'మా సక్కటి సినిమా ముచ్చట్లు'

by Muthe.Rajitha |

మంచిర్యాల, మందమర్రి మండలంలో "గాంధారి ఖిల్లా కాడి మా సక్కని సినిమా" పేరుతో గతేడాది చారిత్రక, వారసత్వ అడవిలో మొదటిసారి అద్భుతంగా జరిగింది.

మొహింద లోయలో మా సక్కటి సినిమా ముచ్చట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాల, మందమర్రి మండలంలో "గాంధారి ఖిల్లా కాడి మా సక్కని సినిమా" పేరుతో గతేడాది చారిత్రక, వారసత్వ అడవిలో మొదటిసారి అద్భుతంగా జరిగింది. ఇప్పుడు కూడా మా సక్కటి సినిమా ముచ్చట్లకు మరోసారి ఉత్సాహంగా యువ రచయితలు, సినిమా టెక్నిషియన్స్, ఆంత్రోపాలజిస్టులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, హిందీ రైటర్స్, అటవీ శాఖ అధికారులు కర్ణాటక రాష్ట్రం, స్వీడన్, అమెరికా దేశాల నుంచి హాజరవ్వడం ఇది కొత్త పరిణామం.ప్రస్తుతం మనమెక్కడున్నాం, ఎక్కడుండాలి, ముందుకు సాగడానికి కలిసికట్టుగా ఏం చేయాలి? అనే అంశాలపై అర్థవంతమైన చర్చకు ఈ కలయిక వేదిక అయింది. సినీ దర్శకత్వం, రచన, గీతరచన, స్వర కల్పన, నటన, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ ఇలా భిన్న శాఖల్లో ఇప్పటికే పనిచేస్తున్న లేదా సహాయకులుగా ఉన్నవారు ఇందులో పాల్గొన్నారు. సినిమా రంగంలోకి రావాలనుకొనే ఔత్సాహికులు కూడా వచ్చి పరిశ్రమ ప్రాథమిక అంశాలను తెలుసుకోగలిగారు.

కొండల మధ్యన సినిమా చర్చ

మొహింద, గిన్నెదరి కళలకు కాణాచి. భారతదేశపు మూలవాసీలో గొప్ప సౌందర్య ద్రృష్టి ఉంది. కొండల నడిబొడ్డున వంద అడుగుల ఎత్తు మీద కొండ, అడవి మధ్యలో దోల్పల వాగు ప్రవహిస్తుంది. అలాంటి జాగల యశ్వంత్ నాగ్, "పల్లెటూరి పిల్లగాడ" కవర్ సాంగ్ ఆదివాసీ మధ్యలో చౌరస్తా బ్యాండ్ కలసి స్థానిక ఉమ్మడి ఆదిలాబాద్ "మా సక్కని సినిమా" ప్రోత్సాహంతో గొప్ప కార్యక్రమంగా నిలిచింది.

ఆదివాసీ

ఒకప్పుడు ఆసిఫాబాద్ దక్షిణాన, పశ్చిమాన ఉన్న లోయ మొహింద, తిర్యాణి ప్రాంతంలో ఓ హమ్లెట్. మొహింజదారో నాగరికత ఉన్న అతి పురాతన భూమి. అటు రాజు గోండులు కోయతూర్ తరతరాలుగా గిన్నెదరి లోయల్లోని అడవి సంస్కృతి, రీతి రివాజులు కాపాడుతున్నవారు. తిర్యాణి లొద్ది తిలాని ఒకప్పుడు ఆదివాసీ గ్రామం. ఇప్పటికీ మట్టి కోట శిథిలాలను చూడవచ్చు. అలాంటి చరిత్ర గల్ల మట్టీ మీద తోటివారు "సోలా థింసా అట్రా వాజ్య" పుట్టుక సావు గురించి సంగీత కళాకారులు డాక్టర్ వెడ్మ శంకర్ తోటి కళాకారుడు తమ జాతి రూపొందించిన వాయిద్యాలు తూటుకోమ్మ, డోలు కిక్రీలతో చౌరస్తా బ్యాండ్‌తో కలిసి విదేశీయుల సంగీత పరికరాలతో ఇరువురు కలిసి మొదటిసారి ఓ కొత్త ప్రయోగం చేయడం చారిత్రకం. 2020వ సంవత్సరంలో మొహింద "ఫిల్మ్ అప్రిషేషన్"‌లో ఇరవై మంది యువకులకు శిక్షణ జరిగింది. ఆ తర్వాత 2025 జనవరి 17, శుక్రవారం, సినిమాకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌కి అంకితం చేశాము. ఆయన స్ఫూర్తితో మనం మేం చేయగలము? మనకున్న మానవ వనరుల తోటి అనే అంశంపై ఇక్కడ మాట్లాడాం. దాన్ని చర్చకు తీసుకొచ్చాము.

సేవ్ ది టైగర్, కొత్త సినిమా

భోథో మండలం, అటవీ శాఖ ఏఫ్ఆర్వో తొడిశెట్టి ప్రణయ్, అడవి మీద అవగాహన పరిరక్షణ, ట్రైబల్ ప్రాంతంలో మలేరియా "సికిలిస్" అనే వ్యాధితో కమ్యూనిటి అంతరించిందని, గిన్నెధరిలో కిలోమీటర్ల మేర ఆవరించిన వుడ్ ఫాసిల్ మరియు ఇంకా రోడ్లు మార్పు లేదని అన్నారు. ఆ తర్వాత "సెవ్ ది టైగర్" సినిమా రచయిత, ఆనంద్ కార్తీక్, తన అనుభవాన్ని వివరంగా చెప్పారు."కొత్త సినిమా" దర్శకుడు అజాద్ ఒంటరిగానే సినిమా నిర్మాణం చేసి రీలీజ్ ప్రయత్నాన్ని అభినందించారు. రాజు ఆకుల ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం అవసరమని గుర్తు చేయడం ఆనందం. అమిత్ రాదారపు, కొత్త కథలు రాసే వారికి సీనియర్ రచయితల అండదండలు అవసరం. ఈ కార్యక్రమం తర్వాత కూడా అవసరమైన సలహా సూచనలు చేస్తే రచయితలు బాగా రాయడం నేర్చుకుంటారనేది సూచన చేశాడు.

కాకజ్ నగర్ కథలు త్వరలో...

అసలు కళ అంటే ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న దాని సందర్భాలను గమనించడం తప్పనిసరి. యువ లఘు చిత్రం దర్శకుడు దిడ్డి వెంకటేష్, పదహారు నిమిషాలతో ఫిల్మ్ చేసాడు. డివోపి స్రృజన్, బి ఎఫ్ ఎ, పారలల్ సినిమా అభివృద్ధి కావాలని కోరారు. సాయికృష్ణ రచయిత ,"కాగజ్ కీ టుకుడా " కాగజ్ నగర్ జీవితం సంబంధించిన కథలు త్వరలో చపాయించే పనిలో ఉన్నాడని చెప్పారు. విశ్రాంత పారెస్ట్ ఉద్యోగి, మల్లయ్య అటవీ పులి మధ్యలో దాని కాన్లిఫీక్ జీవితం వివరించారు. సిడాం ఆర్జుపటేల్ కళల సోలా థింసా అట్రవాజ్య"గురించి, జనవరి 26 వతేదీ యార్క్ జన్మదిన గ్రామోత్సవం ఉందని చెప్పారు. మాములుగా పట్టణంలోనే నిర్వహించే కార్యక్రమాల్లో ఎవరూ కనిపించని పరిస్థితి. మంచిర్యాల నుండి ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో వందమందికి పైగా ఇందులో పాల్గొని తమకు డాక్యుమెంటరీ, సాహిత్యం రాయాలని, సినిమాలు చేయాలని ఆసక్తి కూడా ఉందని మొహింద లింగు, నాగారావ్ చెప్పారు.ఎం కానీ ఇప్పుడు రూరల్ ప్రాంతంలో ఇది జరగడం ఓ కొత్త దారులు వెతుకుతుంది.

కథలకు కాణాచి దక్షిణాది

మొత్తానికి ఈ కలయిక తెలంగాణ సినిమా రూపకల్పనకు ఒక ముందడుగు. ఈ 'ముచ్చట్లు' మళ్ళీ మళ్ళీ సాగాలి. కార్యశాలగా మారాలి. 'దుఃఖపడ్డవాళ్ల దగ్గరే కథలుంటాయి. భారతీయ సినిమా కథల కోసం దక్షిణాది వైపు చూస్తోంది' అన్నారు. ఈ పరిణామాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ నుండి కూడా పరిశ్రమ నైపుణ్యం పెరగాల్సి ఉంది. ఇలా రామసక్కని ముచ్చట్లు మరిన్ని ఫలవంతం కావాలి. ఈ రంగంలో ఉపాధితో పాటు తెలంగాణ జెండా ఇప్పటికైనా రెపరెపలాడాలి.

- అక్కల చంద్రమౌళి వర్మ

సినీ గేయ రచయిత

91775 41446

Next Story