- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

రాజకీయాలు అంటని ప్రేమ కవిత! - మౌమితా ఆలం.
అనువాదం : గీతాంజలి.
వాళ్ళు నాకో సలహా ఇచ్చారు!
ఏంటో తెలుసా?
అసలు ఏ రాజకీయాల మైల లేని ఒట్టి స్వచ్ఛమైన ప్రేమ కవిత్వం రాయమని!
ఒక్క మోహావేశాన్ని మాత్రమే కలిగించే ప్రేమ కవిత్వం అన్నమాట!
....
సరే..నన్ను పాఠక లోకం స్నేహాస్పదురాలైన, చాలా విధేయురాలైన కవయిత్రిగా చూస్తుంది మరి!
*
ఇక నేను వాళ్ళు అడిగిన ప్రేమ కవిత రాస్తాను చూడండి!
ప్రియా ఇటు రా దగ్గరగా రా!
నీ ఒళ్ళోకి నన్ను తీసుకో
నన్ను గాఢంగా కౌగలించుకో!
కానీ ఒక్కటి తెలుసుకో!
నేనొక దళిత ముస్లింని!
అంతే కాదు విడాకులైన స్త్రీని కూడా మరి!
ఆలోచించుకో సరేనా?
*
చాలదూ,ఇది నా బ్రాహ్మణ ప్రేమికుడిని మోహావేశంలో మునకలెత్తించడానికి?
మరింకేం? అతను వస్తాడు! నాతో శృంగారాన్ని అనుభవిస్తాడు, వెళ్ళిపోతాడు!
అంతే ఇక తిరిగి రాడు!
నిజం ఇక ఎప్పటికీ అతనిక తిరిగి రాడు!
*
అతనెక్కడికి వెళ్ళాడో తర్వాత తెలిసింది.
అతను పవిత్రమైన గంగా నదిలో తను ఒక దళిత ముస్లిం స్త్రీ తో శృంగారించిన పాపాన్ని కడుక్కోడానికి మునిగాడని!
*
చూసారా మరి? ఏ రాజకీయాలూ అంటని ప్రేమ కవితని ఎలా రాసేశానో?
నచ్చిందా మరి ?
*






