కవి మాట

by Ravi |

కవి మాట
X

ఉత్సాహంగా కొలువు తీరే రాజు, ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితులనూ, విద్వాంసులనే కాదు, మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలచి వేసింది. పిల్లల అరుపులూ, కేకలూ వినవస్తోంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు. ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులూ అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్లొచ్చాయతనికి. ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కానీ, వీళ్లేం పిల్లలు? వీళ్ల వలన తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా, దుఃఖం ముంచుకొస్తుంది.

'తళుకు బెళుకు రాళ్లు తట్టెడు ఉండడం కన్నా, ఒక్క రత్నం చాలంటారు' అలాగే, కౌరవ సంతానంలా వందమంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే. ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు, ధర్మరాజులాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు. దేనికయినా ప్రాప్తం ఉండాలి. గుణవంతులూ, విద్యావంతులూ అయిన పిల్లలుండాలంటే గతజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు. అంతలోనే కళ్లు తుడుచుకుని, దీర్ఘంగా ఆలోచించసాగాడు.

- విష్ణుశర్మ (పంచతంత్రం నుంచి)

Next Story