మాట మనోవికాసానికి బాట

by Disha edit |
మాట మనోవికాసానికి బాట
X

మనమాట ఆత్మీయతకు బాట

మన పలకరింపు అనురాగానికి అడ్రస్

మన స్నేహం సంతోషానికి సంకేతం

మన బంధం అనుబంధాలకు బడి‌ కావాలి

మన మమత మానవీయతకు గుడి కావాలి

మన సలహా మానవ మనుగడకు మార్గం కావాలి

మన సాంగత్యం మనోవికాసానికి బాట కావాలి

మన ప్రగతి సమాజ పురోగతికి దిక్సూచి కావాలి

మన కలయిక మనలో ఉషారుకు ఊపిరి కావాలి

ఉత్సాహానికి సంకేతం కావాలి

ఉత్తమ ఆలోచనలతో

ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం


నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం

హైదరాబాద్, 94402 45771

Next Story