రాగ మాలిక

by Ravi |

రాగ మాలిక
X

నవ వసంతాన్ని

నింపుకొన్న ప్రకృతి

ఆకృతి హారాన్ని

వొంటిపై నింపాదిగా

రంగరించుకొని

లేలేత కలలు

లాలిత్య హొయలై

నిలుస్తున్నాయి

మారాకు చిగురుతో

గుబురు కొమ్మల

గడుసు గాలి ఈల పాటలు

నాట్యమై కదలాడుతున్నాయి

కునుకు రెక్కల

కుహూ సరిగమల

సొగసు గానాలు

ఆకాశాన్ని అబ్బుర పరుస్తున్నాయి

రెమ్మ రెప్ప వేయడం మరచి

కారు మేఘ కదలికల్ని

కంటి కేమరాలో

నిక్షిప్తం చేస్తోంది

ఆక్షేపణ లేని

అల్లరి సమీరపు

పూల పుప్పొడి గంధాలు

సరిక్రొత్త రాగ మాలికల్ని

మీటుతున్నాయి

మహబూబ్ బాషా చిల్లెం

95020 00415

Next Story