- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12 నుంచి మద్యం దుకాణాలు బంద్
<p>దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకూ మద్యం దుకాణాలకు డ్రై డే ప్రకటించినట్టు సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వీసీ సజ్జనార్ తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 14వ తేదీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా, ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు […]</p>

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకూ మద్యం దుకాణాలకు డ్రై డే ప్రకటించినట్టు సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వీసీ సజ్జనార్ తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 14వ తేదీ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా, ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడానికి 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 14వ తేదీ వరకూ మద్యం దుకాణాలు బంద్ చేయాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కల్లు దుకాణాలు, వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్ బార్స్, క్లబ్బులు బంద్ కానున్నాయి. ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే బుధవారం (17వ తేదీ) కూడా ఈ ఆదేశాలు అమలు అవుతాయి. అంతే కాకుండా, ఒకవేళ ఎక్కడైన రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే.. ఆ సమయంలో మద్యం దుకాణాలు బంద్ అయ్యే అవకాశం ఉన్నట్టు సజ్జనార్ తెలిపారు.






