బాలికల గురుకుల పాఠశాలలో మద్యం షాపులు ? పట్టించుకునేవారే లేరా

by  |
బాలికల గురుకుల పాఠశాలలో మద్యం షాపులు ? పట్టించుకునేవారే లేరా
X

దిశ, జఫర్‌గడ్ : జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రసిద్ధ ప్రఖ్యాతిగాంచిన జఫర్‌గడ్ ఖిలా స్థలం మందుబాబులకు అడ్డాగా మారనుందా..? మండల కేంద్రంలో నూతనంగా మూడు మద్యం షాపులు విద్యాసంస్థల మధ్య ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా జఫర్‌గడ్ నుండి వర్ధన్నపేట వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపున మద్యం షాపులు ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ బ్రాందీ షాప్‌ల‌పై మహిళలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సమాచారం ఇచ్చినా, చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ముడుపులు ముట్టాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు, విద్యార్థినులు ఆందోళన చేసే వరకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉలుకు పలుకు ఉండదా , ఎవరు ఎట్లా చస్తే మాకేంటి అన్న చందంగా వ్యవహరించడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు . నూతనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్న మద్యం షాప్ లను అక్కడినుండి తక్షణమే వేరే చోటికి మార్చాలని ప్రజలు, విద్యార్థినులు, మహిళలు, ప్రజా సంఘాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Next Story

Most Viewed