- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ అండదండలతోనే మద్యం విక్రయాలు?
<p>దిశ, మహబూబ్‌నగర్: అధికార పార్టీ అండదండలు ఉంటే.. తమకు ఎలాంటి నిబంధనలు వర్తించవని కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలపై కఠిన ఆంక్షలు విధించి మూసివేశారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ మండల కేంద్రంలో ఉన్న ఓ వైన్స్ షాపు నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రాత్రి 10 గంటల తర్వాత […]</p>

దిశ, మహబూబ్‌నగర్: అధికార పార్టీ అండదండలు ఉంటే.. తమకు ఎలాంటి నిబంధనలు వర్తించవని కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలపై కఠిన ఆంక్షలు విధించి మూసివేశారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ మండల కేంద్రంలో ఉన్న ఓ వైన్స్ షాపు నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రాత్రి 10 గంటల తర్వాత అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నారని చెబుతున్నారు. ఆ షాపుకు అధికారులు సీల్ వేశారో, వేయలేదో అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. ఒకవేళ వేసినా కూడా సీల్ తీసి మరీ అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని సమాచారం. ఫిర్యాదు చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఆ వైన్ షాపుకు సీల్ వేయలేదు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న స్థానికులు శ్రీసాయివైన్స్ షాపు లైసెన్సును రద్దు చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags: Ruling party leaders Alcohol sales, lockdown, makthal






