సింగరేణి క్వార్టర్స్‌లో మద్యం అమ్మకాలు.. పట్టించుకోని అధికారులు..!

98

దిశ, గోదావరిఖని: సింగరేణికి సంబంధించిన క్వార్టర్స్‌లో అక్రమ నిర్మాణాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ.. కొంతమంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఈ కార్యక్రమాలకు కిందిస్థాయి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న గుడిసె వేసుకుంటేనే కూల్చివేసే అధికారులకు సింగరేణి క్వార్టర్స్‌లో మద్యం అమ్ముతున్నా కనబడటం లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గోదావరిఖని పరిధి విఠల్‌నగర్‌లోని సింగరేణి క్వార్టర్స్‌లో 24 గంటలు మద్యం అమ్మకాలు జరుగుతున్నా కనీసం అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే క్వార్టర్స్‌లలో జరుగుతున్న కార్యక్రమాలపై ఏరియా మొత్తం కోడై కూస్తున్నా.. అధికారుల దృష్టికి వెళ్లకపోవడం వెనక ఆంతర్యమేమిటో అన్న సందేహాలు పలువురు కార్మికుల్లో నెలకొంటున్నాయి. చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటేనే వాటిని కూలగొట్టిన అధికారులకు బహిరంగంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. వాటిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి హస్తం ఉందన్న ప్రచారం స్థానిక కార్మికుల్లో నెలకొంది. ఇప్పటికైనా దీనిపై సింగరేణి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..