మరడోనాకు నివాళి.. మెస్సీకి జరిమానా

by  |
మరడోనాకు నివాళి.. మెస్సీకి జరిమానా
X

దిశ, స్పోర్ట్స్ : సాకర్ దిగ్గజం డిగో మరడోనా ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, అతడి మరణానికి నివాళి అర్పించినందుకు గాను అర్జెంటీనా ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీకి జరిమానా విధించారు. నివాళి అర్పిస్తే జరిమానా విధిస్తారా అనే అనుమానం మీకు రావొచ్చు. అయితే స్పానిష్ సాకర్ ఫెడరేషన్ నిబంధనలు అతిక్రమిస్తూ నివాళి అర్పించినందుకుగాను మెస్సీకి జరిమానా విధించారు. చాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఆదివారం ఒసాసునాతో బార్సిలోనా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో 4-0 తేడాతో బార్సిలోనా జట్టు విజయం సాధించింది.

అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెస్సీ గోల్ చేసి తన జెర్సీని విప్పేసి లోపల ఉన్న మరడోనా జెర్సీని ప్రదర్శించాడు. ఆకాశం వైపు చూస్తూ ముద్దులు పెడుతూ మరడోనాకు నివాళి అర్పించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో జెర్సీని తీసేసి.. వేరే జెర్సీని ప్రదర్శించినందుకు రిఫరీ అతడికి ఎల్లో కార్డ్ చూపించాడు. స్పానిష్ సాకర్ లీగ్ మెస్సీకి 600 యూరోల జరిమానా, బార్సిలోనా జట్టుకు 180 యూరోల జరిమానా విధించింది. కాగా, ఈ జరిమానాపై మెస్సీ, బార్సిలోనా క్లబ్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నది.



Next Story