అవార్డ్ ఫంక్షన్‌లో మేల్ డ్యాన్సర్ ముద్దులాట!

by  |
dancer-Lil-Nas-X
X

దిశ, సినిమా : లాస్ ఏంజిల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్‌లో ‘ది బెట్ అవార్డ్స్ ఫంక్షన్ 2021’ గ్రాండ్‌గా జరిగింది. ఆఫ్రికన్ అమెరికన్ ఆర్టిస్ట్స్ మ్యూజిక్, యాక్టింగ్‌‌లో చేసిన సేవలకుగాను కార్డి బి, మేగాన్ థీ‌తో పాటు మరెంతో మంది యాక్టర్స్ అవార్డులు అందుకున్నారు. ఈ బ్యూటిఫుల్ ఈవెంట్‌లో 22ఏళ్ల ర్యాపర్ లిల్ నాస్ ఎక్స్.. తన ‘కాల్ మి బై యువర్ నేమ్’ ఆల్బమ్ నుంచి మోంటెరో సాంగ్‌పై సిజ్లింగ్ పర్ఫార్మెన్స్‌కు ప్రతీ ఒక్కరు ఫిదా అయ్యారు.

అయితే ఈజిప్ట్ వైబ్‌తో కూడిన ఈ పర్ఫార్మెన్స్‌లో లిల్ నాస్ ఎక్స్.. మేల్ డ్యాన్సర్‌ను కిస్ చేయడం చర్చకు దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలోనూ ట్రోల్స్ ఎదురుకాగా బేఫిటింగ్ రిప్లై ఇచ్చాడు. ఇది ఆఫ్రికన్ కల్చర్‌ను అవమానించేలా ఉందన్న ట్విట్టర్ కామెంట్‌కు సమాధానమిచ్చిన ఆయన.. ‘ఆఫ్రికన్ సంస్కృతిలో స్వలింగ సంపర్కం ఉనికిలో లేదని నటించడం నిజంగా మీకు ఇష్టం’ అని చెప్పాడు. ఇక అభిమానులు తన స్వీట్ పర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Next Story