నాగార్జునసాగర్‌లో 144 సెక్షన్

by  |
నాగార్జునసాగర్‌లో 144 సెక్షన్
X

దిశ, ప్రతినిధి, నల్లగొండ: కృష్ణా నది ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెద్దఎత్తున వస్తోంది. గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు నాలుగు గేట్లను శుక్రవారం ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు సీఈ నరసింహతో పాటు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇదిలావుంటే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ఎగువ ప్రాంతాల నుంచి వస్తోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 3,50,102 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 29880 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 286.0216 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 581.00 అడుగులుగా ఉంది. అధికారులు ముందస్తుగా ఉదయం 11 గంటల సమయంలో సాగర్ డ్యామ్ 4 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి నీటిని పులిచింతల ప్రాజెక్ట్ కు వదిలారు. కొవిడ్ నేపథ్యంలో సాగర్ లో పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. 144 సెక్ష న్ అమలు చేస్తున్నారు. జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.


Next Story