- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆడు మగాడ్రా బుజ్జీ.. కుక్కపిల్లతో 15 రాష్ట్రాల సైకిల్ యాత్ర.!
కుక్కపిల్ల కుంటుతూ తన వెనకాలే వెళ్లింది. ఆ క్షణం నుంచి దోస్త్ అయింది

దిశ, ఫీచర్స్: సోనురాజ్ బీహార్‌లోని నలందాకు చెందిన 20 ఏళ్ల యువకుడు. సైకిల్‌పై దేశాన్ని చుట్టేయాలని 2023లో అయోధ్య రామమందిరం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. ఢిల్లీ హైవేపై గాయపడిన కుక్కపిల్లను చూసి ఆగాడు. సురక్షిత ప్రదేశానికి తరలించి ముందుకు సాగాలనుకున్నాడు. కానీ అది కుంటుతూ తన వెనకాలే పరుగెత్తింది. ఆ క్షణం నుంచి సోను యాత్రలో అదికూడా భాగమైంది.
సాయం చేసింది..
కుక్కపిల్లకు ‘చార్లీ’ అని పేరు పెట్టాడు. సైకిల్‌కు ఒక చిన్న క్యారియర్‌ను జోడించి దాంట్లో కూర్చోబెట్టుకొని వెళతాడు. పేపర్ బాయ్‌గా పనిచేసి సంపాదించి సెకండ్ హ్యాండ్‌లో సైకిల్ కొన్నాడు. అయితే మహారాష్ట్రలో ఒక జీప్ ఢీకొనడంతో సోను ప్రమాదానికి గురయ్యాడు. సైకిల్ దెబ్బతిన్నది. ఆ సమయంలో స్పృహ కోల్పోయిన సోనుకు చార్లీ సహాయం చేసింది. 400 మీటర్లు పరిగెత్తి సమీప దాబాకు చేరి ఒక వ్యక్తిని తీసుకొచ్చింది. తన లడఖ్ పర్యటనలో ప్రఖ్యాత ఎన్విరాన్‌మెంటలిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసిన సోను కొత్త సైకిల్‌ను బహుమతిగా పొందాడు.
కష్టాల ప్రయాణం
కుక్కపిల్లను తీసుకొని సైకిల్ యాత్రం చేయడమంటే అంత ఈజీ కాదు. కొన్నిసార్లు తిండి ఉండేది కాదు. అయినా చార్లీని మాత్రం బాగా చూసుకుంటాడు. సైకిల్‌కు ఎప్పుడూ 2.5 కిలోల డాగ్ ఫుడ్ బ్యాగ్‌ను ఉంటుంది. పెరుగన్నం, రొట్టెలు, పాలు మాత్రమే తింటుంది చార్లీ. గోవా, గుజరాత్, రాజస్థాన్‌లలో తన టెంట్‌ను కొందరు తొలగించారు. కాశ్మీర్‌లో ఉరుములతో కూడిన వర్షంలో ఆశ్రయం లేకుండా చిక్కుకున్నాడు. ఆర్మీ జవాన్లు అతన్ని ఆదరించి, ప్రోత్సహించారు. కేదార్‌నాథ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో గాయంతో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ 13 రోజుల పాటు సహాయం అందించాడు.
జంతు ఆశ్రయకేంద్రం
సైకిల్ యాత్రతో సోను జీవితం మారిపోయింది. మామూలుగా అతడు ఇంట్రోవర్ట్. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ప్రతీదానికి సిగ్గుపడేవాడు. ఇప్పుడు అందరితో ధైర్యంగా మాట్లాడుతున్నాడు. చార్లీతో దోస్తానీ వల్ల జంతువులపై కరుణను పెంచింది. ఇప్పుడతని కల బీహార్‌లో చార్లీ పేరుతో ఒక జంతు ఆశ్రయ కేంద్రం స్థాపించడం. చిన్నగా మొదలుపెట్టి ఆహారం, వైద్యం, దత్తత సౌకర్యాలతో ఒక పెద్ద కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్నాడు. దీనికి రూ. 45-50 లక్షలు అవసరం. కానీ రూ. 10-12 లక్షలతో ప్రారంభించి ఎవరైనా సాయం చేస్తే విస్తరింపజేస్తా అని అంటున్నాడు.
చార్లీ తెచ్చిన మార్పు
సోను, చార్లీల కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోలో మోటార్‌సైక్లిస్ట్ కౌస్తుభ్ ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అదికూడా అతనికి ఎంతో హెల్ప్ అయింది. ఇప్పుడు సోను.. ఫ్రీలాన్స్ ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇటీవల ఒక బ్రాండ్ సహకారాన్ని పొందాడు. ఒక చిన్న కుక్కపిల్ల అతడిని ఎలా మార్చేసిందో చూడండి. మన మధ్యనున్న మనుషులు ఎంత భయంకరంగా ఉంటున్నారో చూస్తున్నాం. అలాంటిది ఒక కుక్కపిల్ల అతడిని నమ్మి, అతడి లక్ష్యాన్నే మార్చేసింది.






