Viral News: ఈ జిరాక్స్ షాపు ఓనర్ తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇది ఎక్కడి పబ్లిసిటీ రా బాబు.. అసలు తగ్గేదేలే

by Vennela |

Viral News: బిజినెస్ లో మనం పైకి రావాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది పబ్లిసిటీ.

Viral News: ఈ జిరాక్స్ షాపు ఓనర్ తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇది ఎక్కడి పబ్లిసిటీ రా బాబు.. అసలు తగ్గేదేలే
X

దిశ, వెబ్ డెస్క్: Viral News: బిజినెస్ లో మనం పైకి రావాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది పబ్లిసిటీ. నలుగురిలో బిజినెస్ చేయడం కన్నా కూడా వారందరికన్నా భిన్నంగా మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకున్నట్లయితే, మీ బిజినెస్ నలుగురిలో ఫేమస్ అవుతుంది అలాగే మీ రాబడి కూడా పెరుగుతుంది. అలాంటి ఒక ఉదాహరణ ఈ వీడియోలో మనం చూడవచ్చు.

ఒక జిరాక్స్ షాపు ఓనరు తన షాపుకు వచ్చిన వారిని ఆకట్టుకునేందుకు ఒక వెరైటీ ఆలోచన చేశాడు. సినిమాల్లో పాపులర్ అయిన డైలాగులు, అలాగే సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగులను తన జిరాక్స్ వ్యాపారానికి తగ్గట్టుగా మలచుకొని అందర్నీ ఆకర్షిస్తున్నాడు. తన షాపు ముందు జిరాక్స్ 3 రూపాయలు, ప్రింటవుట్ 10 రూపాయలు అస్సలు తగ్గేదేలే..వీరమల్లు మాట చెప్తే వినాలి.. అంటూ ఒక కొటేషన్ కనిపిస్తుంది.

ఆ పక్కనే మరో కొటేషన్ డబ్బులు ఎవరికీ ఊరికే రావు...చిల్లర కూడా ఊరికే ఇవ్వరు ఏదైనా కొంటేనే.. అంటూ మరో కొటేషన్ కనిపిస్తుంది. ఇలా ఆ జిరాక్స్ షాప్ ఓనర్ తన టాలెంట్ నిరూపించాడు. నిజానికి ఈ తరహా పబ్లిసిటీ చూసి చాలామంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. చిన్న వ్యాపారం అయినప్పటికీ కాస్త క్రియేటివిటీని జోడిస్తే ఆ బిజినెస్ లో సక్సెస్ సాధించవచ్చు అని నలుగురిలో గుర్తింపు పొందవచ్చని సూచన చేస్తున్నారు.

ఇదిలా ఉంటే జిరాక్స్ ఓనర్ చేస్తున్న పనిపై నేటిజెన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. . ఇలాంటి క్రియేటివిటీనే మనందరం కోరుకునేది. ఇన్నాళ్లు ఎక్కడున్నావ్ రా బాబు నీలాంటి వాడి కోసమే ఒక తరం అంత వెయిట్ చేస్తుంది అంటూ ఫన్నీ జోకులు పేలుస్తున్నారు. మొత్తానికి ఈ సోషల్ మీడియా యుగంలో కాదేది మీమ్స్ చేయడానికి అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారయింది. మీరు కూడా ఈ సరదా వీడియో చూసి ఫన్ ఎంజాయ్ చేయండి.



Next Story