- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలే చలికాలం.. పాముల గురించి ఈ విషయం తెలిస్తే వణకాల్సిందే!?
పాములు అంటే అందరికీ భయమే. కొందరైతే పాము దూరంగా ఉన్న సరే తమ వద్దకే వస్తుందనే భ్రమతో గజగజ వణికిపోతారు.

దిశ,వెబ్‌డెస్క్: పాములు అంటే అందరికీ భయమే. కొందరైతే పాము దూరంగా ఉన్న సరే తమ వద్దకే వస్తుందనే భ్రమతో గజగజ వణికిపోతారు. పాముల వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. పాము కరిస్తే మరణం సంభవిస్తుంది. అలాగే కొన్ని పాము కాట్ల వల్ల శరీరం మీద నెక్రోసిస్ టిష్యూకు గాయమవుతుంది. దీని వల్ల శరీర భాగాన్ని తొలగించాల్సి రావచ్చు. కాబట్టి పాములు అంటే అందరూ భయపడుతుంటారు.
అయితే పాములు వాతావరణాన్ని బట్టి బయట తిరుగుతుంటాయి. అంతేకాదు వాతావరణంలోని మార్పులను గుర్తించే శక్తి కూడా వాటికి ఉంటుంది. ఎండాకాలం, వానాకాలం పాముల బెడద ఎక్కువగా ఉంటుందని పల్లెల్లో వింటూనే ఉంటారు. ఈ క్రమంలో ప్రజెంట్ చలికాలం కొనసాగుతోంది. ఈ శీతాకాలంలో పాముల గురించి ఓ ఆసక్తికర విషయం తెలుసుకుందాం.
చాలా మంది పాములు రాత్రి సమయంలో నిద్రపోతాయి అనుకుంటారు. కానీ, రాత్రి సమయంలో ఎక్కువగా ఉత్సహంతో ఉంటాయి. అంతేకాదు పాములు ఎక్కువగా పగటి పూట నిద్రపోయి రాత్రి సమయంలో చురుకుగా ఉంటాయి. ఇక పెద్ద పెద్ద పైథాన్ పాములు అయితే పగటి పూట మంచిగా నిద్రపోయి రాత్రి కాగానే ఆహారం కోసం పుట్టలోంచి బయటకు వస్తాయి.
ఇకపోతే, పాములు ఎక్కువగా చలికాలంలో నిద్రావస్థలో ఉంటాయి. చలికాలంలోనే పాములు చాలా సేపు నిద్రపోతయాని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సామాన్యంగా పాములు 16 గంటలు నిద్ర పోతాయి. ఇక ఆఫ్రికా ఆసియాలో కనిపించే పెద్ద పెద్ద పైథాన్ పాములు అయితే కనీసం 18 గంటలు నిద్రపోతాయంటున్నారు.
అయితే.. పాములకు కనురెప్పలు ఉండవు, కాబట్టి అవి కళ్ళు మూసుకో లేవు. బదులుగా, స్పెక్టికేల్ అని పిలువబడే రక్షిత, పారదర్శక స్కేల్ వాటి కళ్ళను కప్పివేస్తుంది. ఇది అవి ఎప్పుడు నిద్రపోతున్నాయో చెప్పడం కష్టతరం చేస్తుంది. పాములు నిద్రపోతున్న సమయంలో జీవక్రియ రేటు తగ్గుతుంది.






