ఆఫీసులో అందరి ఫేవరేట్ మీరే.. ఇలా చేసి చూడండి

by Sujitha Rachapalli |   (  Updated:2025-02-17 08:51:28  IST  )

సాధారణంగా ఏ చోట అయినా రాజకీయాలు జరుగుతాయి. ముఖ్యంగా మనం పని చేసే ఆఫీసులో కొందరి పాలిటిక్స్‌కు బలైపోయేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ అలాంటి వారి గురించి వెనకాల మాట్లాడేసుకుని ఊరుకుంటారు. కొద్దికాలం వారితో

ఆఫీసులో అందరి ఫేవరేట్ మీరే.. ఇలా చేసి చూడండి
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఏ చోట అయినా రాజకీయాలు జరుగుతాయి. ముఖ్యంగా మనం పని చేసే ఆఫీసులో కొందరి పాలిటిక్స్‌కు బలైపోయేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ అలాంటి వారి గురించి వెనకాల మాట్లాడేసుకుని ఊరుకుంటారు. కొద్దికాలం వారితో కనెక్షన్, కన్వర్జేషన్స్ బంద్ చేస్తారు. అయితే ఇలా కాకుండా ఆఫీసులో అందరి ఫేవరేట్‌గా మారిపోవచ్చు. అనవసర రాద్దాంతాల్లో చిక్కుకోకుండా.. కొలిగ్స్‌తో స్ట్రాంగ్ రిలేషన్స్ మెయింటేన్ చేయొచ్చు. కానీ ఎలా? అనేది ఇప్పుడు చూద్దాం.

1. పాజిటివ్ వైబ్స్

సహోద్యోగులు మనకు కాంపిటీషన్ ఇవ్వడం అనేది నేచురల్. అలాగని వారిని శత్రువుల్లాగా చూడకూడదు. ఎవరి పని వారు ఎంత కమిట్మెంట్‌తో చేసుకుంటూ పోతే.. ఎవరికి దక్కాల్సిన ప్రశంసలు, ప్రమోషన్స్ వారికి దక్కుతాయి. అందుకని కొలిగ్స్‌తో పాజిటివ్‌గా, ఫ్రెండ్లీగా ఉండటం మంచిది. నవ్వుతూ పలకరించడం.. చేసిన అచీవ్‌మెంట్స్‌కు అప్లాజ్ ఇవ్వడం మీ మధ్య మంచి వైబ్ క్రియేట్ చేస్తుంది.

2. శ్రద్ధగా వినండి

నీకు ఎంత టాలెంట్ ఉన్నా.. ఎంత జ్ఞానం నీ సొంతమైనా.. ప్రపంచంలో నీకు తెలియని విషయం ఖచ్చితంగా ఉంటుంది. అన్ని విషయాలు అందరికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకే ఇతరులు చెప్పేది కూడా వినండి. వారితో కన్వర్జేషన్స్‌పై ఇంట్రెస్ట్ చూపండి. ఈ పద్ధతి మంచి రాపో, నమ్మకాన్ని డెవలప్ చేస్తుంది. ఏది చెప్పినా శ్రద్ధగా వింటారనే హోప్‌తో ప్రతి విషయాన్ని చర్చించేందుకు మిమ్మల్ని చూజ్ చేసుకోవచ్చు. మీరు వారి ఫేవరేట్ అయిపోవచ్చు.

3. హెల్పింగ్ హ్యాండ్

ఒక సంస్థ కొద్ది కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకోవాలంటే టీమ్ ప్లేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ విషయంలోనైనా అప్లికేబుల్ అవుతుంది. మీ కొలిగ్స్‌కు సపోర్ట్ చేసేందుకు ముందు ఉండండి. వారికి అవసరమైనప్పుడు అసిస్ట్ చేయండి. హెల్పింగ్ హ్యాండ్ అందించండి. ఈ అలవాటు మీరు మంచి టీమ్ ప్లేయర్ అని సూచిస్తుంది. ఎవరికి ఏ అవసరమైనా మీ దగ్గరకు వచ్చే కంఫర్ట్‌ను ఇస్తుంది. ఆటోమేటిక్‌గా మీరే లీడర్ అనే భావన సహోద్యోగుల్లో వచ్చేస్తుంది.

4. సరిహద్దులు ముఖ్యమే

అన్ని విషయాల్లో మీరు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. అదే సమయంలో మీ రెస్పెక్ట్ కూడా కాపాడుకోవాలి. ఇందుకోసం పర్సనల్ బౌండరీస్ సెట్ చేయండి. ఇతరుల గురించి నెగెటివ్ టాక్స్ మానేయండి. గాసిపింగ్ అనేది బ్యాడ్ క్వాలిటీ. ఇది ఆటోమేటిక్‌గా మిమ్మల్ని కిందకు దిగజారుస్తుంది. ఇలాంటివి లేనప్పుడు మీ చుట్టూ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోగలరు.

Next Story