Viral Video: ఏటీఎం వెళ్లినప్పుడు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. కార్డు లేకుండానే డబ్బులు తీసేయొచ్చు..

by Vennela |   (  Updated:2025-05-05 05:38:26  IST  )

Viral Video: ఏటీఎం వెళ్లినప్పుడల్లా ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం అనేది సులభమైన ప్రక్రియే.

Viral Video: ఏటీఎం వెళ్లినప్పుడు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. కార్డు లేకుండానే డబ్బులు తీసేయొచ్చు..
X

దిశ, వెబ్ డెస్క్: Viral Video: ఏటీఎం వెళ్లినప్పుడల్లా ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు విత్ డ్రా చేసుకోవడం అనేది సులభమైన ప్రక్రియే. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏటీఎం కార్డు తీసుకెళ్లడం మర్చిపోతుంటాము. అలాంటి అప్పుడు కూడా మీ ఫోన్ యాప్ ఉపయోగించి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

అవును మీరు వింటున్నది నిజమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాబాలు బ్యాంకులో తమ ఏటీఎంలో నుంచి వారి బ్యాంకు యాప్స్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఏటీఎం సెంటర్లోని ఏటీఎం మెషిన్ లో క్యూఆర్ కోడ్ను మీ బ్యాంక్ ఆప్ ద్వారా స్కాన్ చేసి మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాప్ ద్వారా మనం డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు SBI Yono యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రాను రాను బ్యాంకింగ్ సేవలు డిజిటల్ రూపంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేకుండా మనకు పనులన్నీ చకచగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల్లో ఎక్కువగా డిజిటల్ రంగం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో క్షణాల్లో డబ్బు విత్ డ్రా చేసుకోవడం అదేవిధంగా క్షణాలు డబ్బును డిపాజిట్ చేయడం ఎదుటివారికి ట్రాన్స్ ఫర్ చేయడం అనేవి రెప్ప పాటు సమయంలోనే జరిగిపోతున్నాయి.

అయితే టెక్నాలజీ ఎంత పెరిగితే, అటు సైబర్ దొంగలు కూడా అంతగానే పెరుగుతుంటారు. కనుక మీ డిజిటల్ లావాదేవీల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంకు పిన్ నెంబర్, ఏటీఎం కార్డు పై ఉండే నెంబర్, దాని వెనుక ఉండే సివివి నెంబర్ ఎవరికి చెప్పకూడదు. కొంతమంది సైబర్ దొంగలు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని కాల్ చేసి ఈ వివరాలు అడుగుతారు అలాంటి వారికి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు.

Read More..

Home Loan: హోంలోన్ తీసుకున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..ఇలా చేశారంటే 8లక్షల ఆదా చేసినట్లే..!




Next Story