- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home Loan: హోంలోన్ తీసుకున్నవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..ఇలా చేశారంటే 8లక్షల ఆదా చేసినట్లే..!
Home Loan: చాలా మంది తమకంటూ ఒక సెంథిల్లు ఉండాలని కల కంటుంటారు.

దిశ, వెబ్ డెస్క్: Home Loan: చాలా మంది తమకంటూ ఒక సెంథిల్లు ఉండాలని కల కంటుంటారు. అయితే ఈ కోరికను నెరవేర్చుకునేందుకు ఆర్థిక స్థోమత లేక చాలా మంది ముందండగు వేయరు. అందుకే సామాన్య ప్రజలు హోంలోన్ పై ఆధారపడుతుంటారు. సరైన ప్లానింగ్ రీసెర్చ్ లేకుండా హోంలోన్ తీసుకుంటే చాలా నష్టాలు చూడాల్సి ఉంటుంది. ఈ లోన్స్ పై వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈమధ్యే ఆర్బిఐ రెపోరేటును తగ్గించింది. దీంతో హోంలోన్ పై వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. ఈ మార్పు వల్ల లోన్ తీసుకున్నవారికి లాభం చేకూరుతుంది. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఎందుకంటే బెనిఫిట్స్ సెలక్ట్ చేసుకున్న వడ్డీ రేటు విధానంపై ఆధారపడి ఉంటాయి.
హోంలోన్ వడ్డీ రేట్లు బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింట్ రేటు, బేస్ రేటు, మార్చినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు, ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు వంటి విధానాల్లో ఉంటాయి. బీపీఎల్ఆర్ సాధారణంగా 11.15శాతం వద్ద ఉంటాయి. ఇదే ఎక్కువ. బేస్ రేటు 10.4శాతం, ఎంసీఎల్ఆర్ 9శాతం వద్ద ఉంటాయి. ప్రస్తుతం ఈబీఎల్ఆర్ 8.65శాతం వద్ద అన్నింటికంటే తక్కువగా ఉంది. పాత విధానాల కింద లోన్ తీసుకున్నవాళ్లు రేపోరేటు తగ్గింపు ప్రయోజనాలు పూర్తిగా పొందలేరు. ఎందుకంటే వీటిలో రేటు మార్పులు నెమ్మదిగా ఉంటాయి.
ఉదాహరణకు బీపీఎల్ఆర్ లో ఉన్న రూ. 30లక్షల లోన్లపై నెలలవారీ ఈఎంఐ రూ. 34,281 ఉంటే ఈబీఎల్ఆర్ లో రూ. 29, 807 మాత్రమే ఉంటుంది. ఈ తేడాతో మొత్తం టెన్యూర్ లో రూ. 8.23 లక్షల వరకు ఆదా అవుతుందన్నమాట. 2025ఏప్రిల్ నాటికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 8.1శాతం నుంచి హోంలోన్స్ అందిస్తున్నాయి. ఈబీఎల్ఆర్ ఆర్బిఐ రెపోరేటుతో నేరుగా లింక్ అయి ఉంటుంది. ప్రస్తుత రేపోరేటు 6శాతం వద్ద ఉంది. బ్యాంకులు సాధారణంగా 2.65శాతం మార్జిన్ ను జోడించి ఈబీఎల్ఆర్ ను నిర్ణయిస్తాయి. ఈ సిస్టమ్ 2019 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది పాత విధానాలైన బీపీఎల్ఆర్, బేస్ రేటు, ఎంసీఎల్ఆర్ కంటే మెరుగైన విధానం. రెపోరేటు తగ్గినప్పుడు ఈ ఈబీఎల్ఆర్ లోన్స్ వడ్డీ రేట్లు తక్షణమే తగ్గుతాయి. అదే పాత విధానాల్లో మాత్రం ఇది అంత వేగంగా ఉండదు. అందుకే ఈబీఎల్ఆర్ కు మారిన వారికి రెపోరేటు మారగానే తక్కువ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. దీంతో ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది.






