- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lifestyle: ప్రతి చిన్న విషయానికి అరుస్తున్నారా.. కారణం ఇదే కావచ్చు..!
ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు చిరాకు వస్తుంటుంది

దిశ, వెబ్ డెస్క్ : మనుషుల్లో చాలా రకాలు ఉంటారు. కొందరు నిదానంగా ఉంటే .. మరి కొందరు స్పీడ్ గా రియాక్ట్ అవ్వగా.. ఇంకొందరు చిన్న దానికే కోపం తెచ్చుకుంటారు. అసలు, ఇలా ఎందుకు అవుతుందో వారికీ కూడా అర్థం కాదు. కానీ, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు చిరాకు వస్తుంటుంది. కోపం తగ్గిపోయిన తర్వాత ఇలా ప్రవర్తించింది నేనేనా అని కూర్చొని ఏడుస్తుంటారు. అయితే.. ఈ కోపాలకు రావడం వెనుక ఓ కారణం ఉందని పరిశోధకులు కూడా చెబుతున్నారు.
అసలు ఏ విషయానికి కోపం ( Angry) వస్తుందో అది తెలుసుకుని దాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే .. మీ కోపాలన్నీ మాయమైపోతాయి. అదేదో కాదండి నిద్ర. మన శరీరంలో అనారోగ్య సమస్యలన్నింటికీ కారణం నిద్ర సరిగా లేకపోవడం. రాత్రి సమయంలో తక్కువగా నిద్రపోయే వారికీ కోపం ఎక్కువగా వస్తుందట. అంతే కాదు.. తక్కువగా నిద్రపోయేవాళ్లు తమదైన ఒక నెగెటివ్ ప్రపంచంలో జీవిస్తారట. ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుస్తుంటారు.. అంటూ చెబుతున్నారు పరిశోధకులు.
కాబట్టి, రోజూ కనీసం 7 గంటలు అయిన నిద్రపోవాలి. 7 గంటల కంటే తక్కువగా నిద్రపోయిన వారిలోనే ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయట. 7 గంటలు కంటే ఎక్కువ నిద్రపోయిన వాళ్ళలో చిరాకు లాంటివి కనిపించట్లేదని పరిశోధకులు కూడా చెబుతున్నారు. మీకూ కోపం వస్తుందా.. అయితే.. మీరు ఎక్కువ సేపు నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.






