Viral video: వావ్.. ఈ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు

by Yella Dhawani Reddy |

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది తమ టాలెంట్‌ను నెట్టింట ప్రదర్శిస్తూ పాపులర్ అవుతున్నారు.

Viral video: వావ్.. ఈ చిన్నారి డ్యాన్స్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది తమ టాలెంట్‌ను నెట్టింట ప్రదర్శిస్తూ పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఆదరిస్తుంటారు. వారి ముందు మాటలు, డ్యాన్స్, ఫన్నీ చేష్టలు.. నెటిజన్లను నిత్యం అలరిస్తుంటాయి. ఇక తాజాగా ఓ చిన్నారి సెలబ్రిటీ తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, తన క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఐదేళ్ల చిన్నారి ఎల్లో కలర్ సారీ కట్టుకుని 'లక్డీ దివానీ' అనే భోజ్‌పురి పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అంతేకాదు, లిరిక్స్‌కు తగ్గట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా నెటిజన్లు తెగ లైక్ చేస్తూ చిన్నారి డ్యాన్స్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ చిన్నారికి ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అహ్మదాబాద్‌కు చెందిన బుజ్జి తల్లి పేరు అనన్య. ఇన్‌స్టాలో 'adorable_aanyaa' అనే పేజీ కూడా ఉంది. అంతేకాదు, 932k మంది ఫాలోవర్లు ఉన్నారు. తమ తల్లిదండ్రులు ఈ పేజీని హ్యాండిల్ చేస్తూ తరచూగా అనన్య డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.

Next Story