58గంటల కిస్‌తో వరల్డ్ రికార్డ్.. 70ఏళ్ల వృద్ధ జంట ఘనత

by Disha Web Desk 6 |
58గంటల కిస్‌తో వరల్డ్ రికార్డ్.. 70ఏళ్ల వృద్ధ జంట ఘనత
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా జంటల మధ్య ప్రేమ బంధం ముద్దుతో మరింత బలపడుతుంది. ఒక కిస్‌ కేలరీల శక్తిని అందిస్తుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి కూడా. అయితే ఈ కిస్ డ్యురేషన్ ఓ రెండు లేదా మూడు నిమిషాలు ఉండొచ్చు కానీ అంతకు మించి ఉండదని చాలా మంది అభిప్రాయం. అయితే ఏకంగా 58 గంటలకు పైగా ముద్దును ఆస్వాదించిన థాయ్‌లాండ్ వృద్ధ జంట వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది.

వాలెంటైన్స్‌ డే సందర్భంగా థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో నిర్వహించిన ముద్దుల పోటీలో సుమారు తొమ్మిది జంటలు పాల్గొన్నారు. అందులో 70 ఏళ్ల వయస్సులో ఉన్న ఎక్కాచై తిరనారత్, లక్సానా తిరానారత్ దంపతులు కూడా ఉన్నారు. కాగా ఈ పోటీలో మిగతా వారంతా రెండుమూడు నిమిషాలకే అలసిపోగా.. ఈ వృద్ధ జంట మాత్రం సుమారు 58గంటల 35నిమిషాల 58సెకన్లు కిస్ చేసుకుని ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సమయం ముద్దు పెట్టుకున్న జంటగా రికార్డు నెలకొల్పి.. నెటిజన్ల నుంచి ప్రంశంసలు అందుకుంటున్నారు.

రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ద్వారా నిర్వహించిన ఈ పోటీ నియమాల ప్రకారం.. ఈవెంట్‌లో పాల్గొన్న జంటలు కిస్ చేసుకున్న సమయంలో ఒకరినొకరు విడిపోకుండా ఉండేందుకు ఒకరి పాదాలపై ఒకరు కాళ్లు పెట్టి ఉంచాలి. అయితే ఇలా చేసిన సమయంలో కిస్ చేసుకుంటూ టాయిలెట్‌ కూడా వెళ్లినట్లు ఈ పోటీలు నిర్వహించిన సంస్థ ప్రెసిడెంట్ వివరించారు. కాగా 'ఈ వృద్ధ జంట రెండున్నర రోజులు నిద్రపోనందున చాలా అలసిపోయారు. వారు అన్ని సమయాల్లోనూ నిలబడాల్సి వచ్చింది. కాబట్టి వారు చాలా బలహీనంగా ఉన్నారు' అని పేర్కొన్నారు. ఏది ఏమైనా రెండున్నర రోజులపాటు కిస్ చేయడమనేది చిన్న విషయమేమి కాదు. అందులోనూ 70ఏళ్ల వయస్సులో వీరి స్టామినాకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో పాటు.. రెండు డైమండ్ రింగ్స్, లక్షరూపాయలు నగదును బహుమతిగా కూడా గెలుచుకున్నారు.

Next Story

Most Viewed