World Lion Day

by Disha Web Desk 7 |
World Lion Day
X

సింహాల గురించి అవగాహన పెంచేందుకు, వాటి రక్షణ & పరిరక్షణకు మద్దతు సమీకరించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 10న 'ప్రపంచ సింహాల దినోత్సవం' జరుపుకుంటారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ యానిమల్స్(WWF) ప్రకారం, సింహాన్ని తరచుగా 'అడవికి రాజు'గా పిలిచినప్పటికీ.. నిజానికి ఇది పచ్చిక బయళ్లు, మైదానాల్లో మాత్రమే నివసిస్తుంది. కాగా 'బ్రెయిన్‌చైల్డ్' కోఫౌండర్స్ డెరెక్ - బెవర్లీ జౌబెర్ట్ దంపతులు.. సింహాల మీద ఉన్న ప్రేమతో 2013లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడవిలో నివసించే సింహాలను రక్షించేందుకు నేషనల్ జియోగ్రాఫిక్, ది బ్యాగ్ క్యాట్ ఇనిషియేటివ్ లాంటి గొప్ప సంస్థలతో కలిసి పనిచేశారు. ఇక భారతదేశంలో సింహాల జనాభా 2015లో 523 నుంచి 2020లో 674కి చేరుకుని అత్యధికంగా 29 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వాటి పరిధి 2015లో 22,000 చ.కి.మీ నుంచి 30,000 చ.కి.మీ విస్తరించిందని నివేదిక పేర్కొంది.

కిడ్ ఫ్రెండ్లీ న్యూస్‌పోర్టల్..


Next Story

Most Viewed