నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-10 15:08:08  IST  )

ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఉద్యోగుల పని వేళల్లో అనేక మార్పులు వచ్చాయి.

నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో ఉద్యోగుల పని వేళల్లో అనేక మార్పులు వచ్చాయి. కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్‌లో (Night Shift Duties) కూడా పనిచేయించుకుంటున్నాయి. ఇలా రాత్రి పూట పనిచేసే వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా జరిపిన ఓ అధ్యయనం నిద్రలేమి, నైట్ షిఫ్ట్ చేసేవారికి మరోసారి వార్నింగ్ బెల్ మోగించింది.

మనిషి ఆరోగ్యాన్ని నిద్ర చాలా ప్రభావితం చేస్తుంది. సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా నీరసంగా.. చికాకుగా అనిపిస్తుంది. ఇది అలాగే కొనసాగితే మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే కచ్చితంగా 8 గంటలు పడుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇక సరైనా నిద్రలేని వారిలో నిద్రలేమితో బాధపడేవారు కొందరైతే, నైట్ షిఫ్టులు చేసేవారు మరికొందరు. శరీరానికి సిర్కాడియన్ రిథమ్ ఉంటుంది. దాని ప్రకారం మధ్యాహ్నం, రాత్రి నిద్రపోవాల్సి ఉంటుంది. కానీ నైట్​ షిఫ్టుల వల్ల ఆ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాదు, సాధారణంగా నిద్రకు కారణమయ్యే మెలటోనిన్, తరచుగా రాత్రి విడుదలవుతుంది.

నిద్రలేమి బాధితులు, నైట్ షిఫ్టులు చేసేవారిపై తాజాగా నార్వే పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. మొత్తం 1,335 మంది నర్సులను (35 ఏళ్లు పై బడిన వారు) అధ్యయనం చేసి కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా నైట్ షిఫ్టు చేసేవారు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. వీరి జీర్ణక్రియ కూడా దెబ్బతింటుందని తెలిపారు. అలాగే, న్యుమోనియా/బ్రోన్కైటిస్ వచ్చే రిస్క్ 129 నుంచి 288 శాతం అధికమని అధ్యయనంలో గుర్తించినట్లు చెప్పారు. అంతేకాదు, గ్యాస్ట్రో సమస్యలు, గుండెపోటు, మెదడుపోటు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

For more Health news : https://www.dishadaily.com/health

Next Story