పనిలో మెరుగుదల కనబడాలా.. అయితే ఇంట్లో ఆలోచించకండి

by Phanindra |   (  Updated:2023-04-18 14:28:24  IST  )

నోటిఫికేషన్స్‌ను సైలెన్స్ మోడ్‌లో పెట్టడం, వర్కింగ్ డే ముగిసిన తర్వాత ఇమెయిల్స్‌ను ఇగ్నోర్ చేయడం వల్ల.. ఎంప్లాయిస్, మేనేజర్స్ మరుసటి రోజు పనిలో అధికంగా శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించగలరని తాజా అధ్యయనం తెలిపింది.

పనిలో మెరుగుదల కనబడాలా.. అయితే ఇంట్లో ఆలోచించకండి
X

దిశ, ఫీచర్స్: నోటిఫికేషన్స్‌ను సైలెన్స్ మోడ్‌లో పెట్టడం, వర్కింగ్ డే ముగిసిన తర్వాత ఇమెయిల్స్‌ను ఇగ్నోర్ చేయడం వల్ల.. ఎంప్లాయిస్, మేనేజర్స్ మరుసటి రోజు పనిలో అధికంగా శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించగలరని తాజా అధ్యయనం తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా (యుఎఫ్), యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల నేతృత్వంలో జరిగిన అధ్యయనం ప్రకారం.. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను చర్చించడం, ఆలోచించడం చేయకుండా డిస్‌కనెక్ట్ అవుతూ.. ఆఫీసు వర్క్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్‌ను కొనసాగించడంపై దృష్టి సారించిన వ్యక్తులు మరుసటిరోజు పనిలో మెరుగైన సామర్థ్యాన్ని చూపుతారు. టీమ్ లీడర్లు, మేనేజర్లు అయితే ఈ కారణంగా మరింత సమర్థవంతమైన నాయకులుగా గుర్తింపు పొందుతారు.

యూఎస్‌ కేంద్రంగా పరిశోధకులు వ్యాపారాలు, సంస్థల నిర్వాహకులు, అక్కడి ఉద్యోగుల వర్క్ స్టైల్, శక్తి, సామర్థ్యాలపై 2019లో ఒకసారి, 2022లో మరోసారి సర్వే నిర్వహించారు. ముందు రోజు రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు పనిని పూర్తిగా డిస్‌కనెక్ట్ చేయగలిగిన మేనేజర్లు, లేదా ఎంప్లాయీస్ శక్తి, సామర్థ్యాలు మరుసటి రోజు ఉదయం పనిలో చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నట్లు తేలింది. అంతేగాక అలాంటివారు ఆఫీసుల్లో తమ బాస్‌ల ద్వారా ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాత్రిపూట ఉద్యోగం, ఆఫీసు పని గురించి తరుచుగా ఆలోచించేవారు ఆందోళనకు గురవుతారని, మరుసటిరోజు పనితీరుపై ఆ ప్రభావం పడుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు. మునుపటిరోజు ఆలోచనల ఎఫెక్ట్ తర్వాతిరోజు వారిలో శక్తి, సామర్థ్యాలను దెబ్బతీస్తుందని.. పనిలో ప్రతికూలతలు ఎదురవుతాయని కనుగొన్నారు. పైగా ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉన్న మేనేజర్స్ లేదా ఎంప్లాయీస్ ఇంట్లో ఉన్నప్పుడు తమ ఉద్యోగాలపై దృష్టి సారిస్తూ సమయాన్ని వెచ్చిస్తే అసమర్థులుగా మారే అకాశం ఉందని పరిశోధకుడు లనాజ్ పేర్కొన్నాడు.

బ్యాలెన్సింగ్ మస్ట్

ఆఫీసులో మీరు సమర్థవంతమైన ఉద్యోగులుగా ఉండాలంటే ‘పనిని, పర్సనల్ లైఫ్‌ను వేర్వేరుగా చూడాలి. వర్కింగ్ డే ముగిసిన తర్వాత ఇంట్లో కూడా దాని గురించే ఆలోచించడం వదిలేయాలి. బదులుగా ఎక్సర్ సైజ్ చేయడం, కుటుంబం, ఫ్రెండ్స్‌తో క్వాలిటీ టైమ్ కేటాయించడం, కలిసి భోజనం చేయడం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, అవసరం మేరకు రెస్ట్ తీసుకోవడం వంటివి చేయాలి. దీనివల్ల ఆఫీసుల్లో ఎదుర్కొనే పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. మరుసటి రోజు మీ పనిలో మెరుగుదల కనిపిస్తుంది.

Also Read..

సైడ్ ఎఫెక్ట్స్‌‌ నివారణకు కొత్త మెడికేషన్‌‌ను కనుగొన్న సైంటిస్టులు

Next Story