వర్క్‌ ఫ్రెండ్లీ కేఫ్‌లు.. నగరాల్లో విస్తిరిస్తున్న నయా కల్చర్

by Javid Pasha |

విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, టెకీలు, స్టూడెంట్స్ కాఫీ సిప్ చేస్తూ ప్రశాంతంగా వర్క్ చేసుకునే కాఫీ స్పాట్స్ నగరాల్లో విస్తరిస్తున్నాయి.

వర్క్‌ ఫ్రెండ్లీ కేఫ్‌లు.. నగరాల్లో విస్తిరిస్తున్న నయా కల్చర్
X

దిశ, ఫీచర్స్ : మీరు ఆఫీసులో పనితో, రిమోట్ వర్కుతో విసిగిపోయారా? వర్క్‌ఫ్రమ్ హోమ్‌లో ప్రశాంతతను కోల్పోతున్నారా? అయితే మా వద్దకు రండి అంటున్నాయి బెంగళూరులోని కాఫీ హబ్స్(Third Wave Coffee, Blue Tokai, The Peck)యాజమాన్యాలు. ఇక్కడ మీకు అనుకూలమైన ప్రశాంత వాతావరణం మేం క్రియేట్ చేస్తామని చెబుతున్నాయి. అంతేకాదు ఇక్కడ ఎవరైనా, ఎంత సేపైనా, ఎటువంటి టెన్షన్ లేకుండా, కాఫీ సిప్ చేస్తూ, నిశ్శబ్ద వాతావరణంలో పనిచేసుకోవచ్చు. కాకపోతే కాఫీ ఖర్చులతోపాటు కొంత అదనంగా చార్జ్ చేస్తారు. ఖర్చు అయితే అవ్వొచ్చు కానీ మెంటల్ పీస్ మాత్రం సూపర్ బ్రో అంటున్నారు టెకీలు. వీటిని ‘వర్క్‌ఫ్రమ్ కేఫ్’లు అని కూడా పిలుస్తున్నారు.

కాఫీ స్పాట్స్ కల్చర్..

వర్క్‌ఫ్రమ్ కేఫ్ లేదా కాఫీ స్పాట్ కల్చర్ కేవలం బెంగళూరుకే పరిమైంది కాదు. ఇటీవల భారతదేశంలోని అన్ని మెట్రో నగరాల్లో విస్తరిస్తున్న నయా ట్రెండ్ ఇది. ముఖ్యంగా జెన్-Zలో, మిలీనియల్స్‌లో బాగా ప్రాచుర్యంపొందుతోంది. తాజాగా #WorkFromCafe, #BengaluruCafe #CafeHopping పేర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం కూడా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి కాఫీ స్పాట్స్ నగర యువతను ఎలా ఆకట్టుకుంటున్నాయో, వర్క్-ఫ్రెండ్లీ కేఫ్‌లు ఎలా మారుతున్నాయో తెలియజేస్తోంది.

మెట్రో నగరాల్లో విస్తరణ

కాఫీ‌స్పాట్ కల్చర్ ట్రెండ్ బెంగళూరుతోపాటు హైదరాబాద్, పుణే, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్, చెన్నైలో విస్తరిస్తూ పాపులర్ అవుతున్నది. కొత్త కొత్త స్టార్టప్‌లు పుట్టుకురావడం, ఇప్పటికే విస్తరించి ఉన్న ఐటీ హబ్‌లు, ఇతర అవకాశాలు దీనికి కారణం అవుతున్నాయి. యువత, ఫ్రీలాన్సర్లు, రిమోట్ వర్కర్లు ఎక్కువగా ఉండటం వల్ల కేఫ్‌లు కూడా వర్క్ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, బంజారాహిల్స్, కోకోపేట, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్క్-ఫ్రెండ్లీ కేఫ్‌లు రిమోట్ వర్కర్లను ఆకట్టుకుంటున్నాయి.Roast 24 Seven, True Black Coffee, Subko, Tiger Lily వంటి వర్క్ ఫ్రెండ్లీ కెఫ్‌లు.. ఫాస్ట్ వై-ఫై, పవర్ సాకెట్లు, మంచి అంబియన్స్‌తో గంటల తరబడి కూర్చోవడానికి ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా టెక్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కల్చర్ వేగంగా పెరుగుతోంది.

వర్క్ ఫ్రెండ్లీ వెదర్..

వర్క్‌ఫ్రెండ్లీ కాఫీ స్పాట్స్‌లో సమయం గడపడానికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎలాంటి రష్ గానీ, విచిత్రమైన చూపులు గానీ మిమ్నలి ఇబ్బంది పెట్టవని టెకీలు చెబుతుంటారు. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌తో పని చేసుకోవడానికి, చదువుకోవడానికి లేదా స్నేహితులతో సమయం గడపడానికి ఇవి స్వాగతం పలుకుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఈ కాఫీ స్పాట్స్‌లో సమయం ఎలా గడిచిపోతాయో తెలియదు. అంత బాగుంటుంది వెదర్ అంటారు పలువురు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పని చేసుకునే ఫ్రీలాన్సర్లు, స్టూడెంట్స్, స్టార్టప్ యూత్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుంటారని చెబుతుంటారు. గుడ్ అంబియన్స్, కంఫర్టబుల్ సీటింగ్, ప్లగ్ పాయింట్లు, ఫాస్ట్ ఇంటర్నెట్‌తో ఇవి యువతకు ఫేవరెట్ వర్క్ స్పేస్‌లుగా మారుతున్నాయి. డైలీ రొటీన్‌లో భాగమైపోతున్నాయి.

Next Story