- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అలర్టింగ్ ఇయర్‌పీస్’..మహిళలకు రక్షణగా స్పెషల్ గ్యాడ్జెట్!
మహిళల రక్షణ కోసం ‘అలర్టింగ్ ఇయర్‌పీస్’ అనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను 16ఏళ్ల బాలిక తయారుచేసింది.

దిశ, ఫీచర్స్: చెవిపోగు మహిళలకు అందాన్నే కాదు ఇకపై సెక్యూరిటీగా ఉండనుంది. మీకు నచ్చిన రంగులో మీ మొహంపై తలతల మెరుస్తూనే ప్రపంచాన్ని ఓ కంట కనిపేడుతూ ప్రమాదం నుంచి కాపాడనుంది. ఈ మేరకు స్త్రీలపై ఆగయిత్యాలు పెరిగిపోతున్న క్రమంలో ఎలాగైనా భద్రత కల్పించాలనే లక్ష్యంతో 16ఏళ్ల బాలిక Bohlale Mphahlele అద్భుతం చేసింది. ఎవరైనా ప్రమాదంలో ఉంటే వెంటనే వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులకు సమాచారం అందించే ‘అలర్టింగ్ ఇయర్‌పీస్’అనే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. సాధారణ చెవిపోగులా ధరించే ఈ పరికరంలో అధునాతన సాంకేతికతను అమర్చింది. అంత ఈజీగా పగలగొట్టలేని, కోడ్ తెలియకుండా స్విచ్ ఆఫ్ కూడా చేయలేని Alerting Earpiece ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
మైక్రో కెమెరా..
స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయి ఉండే ఈ ఇయర్‌పీస్‌లో చిన్న మైక్రో కెమెరా ఉంటుంది. ఆపదలో ఉన్నప్పుడు Alerting Earpieceను యాక్టివేట్ చేసి దానిపై నొక్కగానే ముందే డివైజ్‌లో సెట్ చేసి పెట్టుకున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నంబర్లను అలర్ట్ చేస్తుంది. క్షణాల్లోనే GPS లోకేషన్‌ను తనవారితోపాటు పోలీసులకు సెండ్ చేస్తుంది. ఘటన ప్లేస్, డిటెయిల్స్, నిందితుడి ఫేస్, వాయిస్ వివరాలను కూడా పంపిస్తుంది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. సాధారణ చెవిపోగు, ఇయర్‌ఫోన్‌ల లాగే ఉండటం వల్ల ఇది ప్రత్యేకంగా ఇతరుల దృష్టిలో పడదు.
మఫాహేలే అలర్ట్స్..






