అమ్మాయిలు బాయ్‌ ఫ్రెండ్‌‌లో ఏం చూసి ఇష్టపడతారు? అధ్యయనంలో తేలిందిదే..!!

by Javid Pasha |   (  Updated:2026-01-02 07:49:02  IST  )

లైఫ్ పార్ట్‌నర్‌ లేదా బాయ్ ఫ్రెండ్‌ను సెలెక్ట్ చేసుకునే విషయంలో అమ్మాయిలు అందం, ఫిట్‌నెస్ కంటే కూడా అధిక ప్రాధాన్యతనిచ్చే విషయాలు వేరు! ఏమిటంటే..

అమ్మాయిలు బాయ్‌ ఫ్రెండ్‌‌లో ఏం చూసి ఇష్టపడతారు? అధ్యయనంలో తేలిందిదే..!!
X

దిశ, ఫీచర్స్: జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో సాధారణంగా ఒక మహిళ ఏం ఆలోస్తుంది? ఎలాంటి వ్యక్తిని కోరుకుంటుంది? అలాగే ఒక పురుషుడు ఎలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? ఇదే విషయంపై ఓ ఇద్దరు ప్రముఖ సైకాలజిస్టులు నిర్వహించిన అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. సెక్సువల్ స్ట్రాటజీస్ థియరీ కింద సైకాలజికల్ రివ్యూలో అవి పబ్లిష్ అయ్యాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అందం కంటే అదే ముఖ్యం!

తాజా అధ్యయనం ప్రకారం మహిళలు లైఫ్ పార్ట్‌నర్‌ లేదా బాయ్ ఫ్రెండ్‌ను సెలెక్ట్ చేసుకునే విషయంలో చదువు, అందం, ఫిట్‌నెస్ (Physical appearance) వంటి అంశాలకంటే ఆర్థిక స్థిరత్వం, మంచి ఆదాయ సామర్థ్యానికే(financial stability and income generation) అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంటే అందరూ ఇలాగే ఆలోచిస్తారని కాదు, కానీ అత్యధిక మంది మాత్రం ఇలాగే ఆలోచిస్తారని అధ్యయనం స్పష్టం చేసింది. ఇక పురుషుల విషయానికి వస్తే, వీరు తాము ప్రేమించబోయే లేదా పెళ్లి చేసుకోబోయే మహిళలో చదువు, ఆర్థిక స్థిరత్వం తదితర విషయాలకంటే అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తేలింది. ఇది కేవలం ఏదో ఒక దేశానికో, ఏదో ఒక సమూహానికో, సంస్కృతికో పరిమితమైన అంశం కాదు, దాదాపు అన్ని దేశాల్లోనూ, మల్టిపుల్ కల్చర్స్‌లోనూ ఇది ఉందని కనుగొన్నారు.

విశ్వసనీయతకు విలువ

సాధారణంగానే పురుషులు సగటున ఫిజికల్ అట్రాక్టివ్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధ్యయనాన్ని విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. అయితే మహిళలు మాత్రం ఇందుకు భిన్నం. వీరు లాంగ్-టర్మ్ సెక్యూరిటీతో ముడిపడిన లక్షణాలను ఎక్కువగా ఇష్టపడతారు. స్థిరమైన ఆదాయం, మంచి అలవాట్లు, మంచి లక్ష్యం, విశ్వసనీయత లేదా నమ్మకం(ambition and reliability) వంటి వాటికి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఈ ప్రిఫరెన్సెస్ లాంగ్-టర్మ్ రిలేషన్‌షిప్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ లైఫ్ ప్లానింగ్‌తో ముడిపడి ఉన్నాయని రీసెర్చర్స్ అంటున్నారు. మొత్తానికి అట్రాక్షన్ లుక్స్‌కు మించి ఫైనాన్షియల్ స్టేబిలిటీ, ఫ్యూచర్ సెక్యూరిటీ, డిపెండబిలిటీ వైపే మహిళలు ఎక్కువగా మొగ్గు చూపుతారని అధ్యయనం పేర్కొన్నది.

Next Story