- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fruits: మహిళలు ఈ ఫ్రూట్స్ ను తప్పక తినాల్సిందే.. ఎందుకంటే..?
సాధారణంగా 30 ఏళ్ళ తర్వాత మహిళలు విటమిన్స్ లోపించి నీరసం అవుతుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏ మనిషికైనా వృద్ధాప్య దశ ఉంటుంది. ఇది నమ్మాల్సిన వాస్తవం. వయసు పెరిగే కొద్దీ, వారి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అప్పటి నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా శరీరం సహకరించదు. బలహీన పడుతుంటారు. సాధారణంగా 30 ఏళ్ళ తర్వాత మహిళలు విటమిన్స్ లోపించి నీరసం అవుతుంటారు. విటమిన్ బి12, ఐరన్, కాల్షియం మొదలైన సమస్యలతో బాధపడుతుంటారు. అందుకే ముందు నుంచే ఈ పండ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
చెర్రీ: 30 ఏళ్ళ తర్వాత మహిళలు వారి ఫుడ్ డైట్ లో చెర్రీలను చేర్చుకోవడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే, ఇవి వయస్సు సంబంధిత సమస్యలను కూడా తగ్గించగలదు. ఎముకలను బలపరుస్తుంది. ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. వారంలో ముందు రోజులు చెర్రీ జ్యూస్ తాగుతూ ఉండాలి.
టమాటో: టమాటోను ప్రతి మహిళ తప్పక తీసుకోవాలి. మహిళలకు లైకోపీన్ అవసరం. ఎందుకంటే, ఇది ఆడవాళ్ళ అందాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. కాబట్టి, ప్రతిరోజూ టమోటాలు తినాలి. ఇది పొట్ట సమస్యలు, కడుపు నొప్పి రాకుండా చేస్తుంది.
బొప్పాయి: ప్రతి స్త్రీ తినాల్సిన పండు బొప్పాయి. ఎందుకంటే దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫోటోకెమికల్స్ ఉంటాయి. అలాగే, ఇది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
ఆపిల్: రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం కూడా ఉండదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే, దీనిలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే, ఇది కడుపుని శుభ్ర పరుస్తుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.






