పోర్న్ సైట్‌లో పెళ్లి.. అందరికీ ఆహ్వానం!

by Disha Web Desk 7 |
పోర్న్ సైట్‌లో పెళ్లి.. అందరికీ ఆహ్వానం!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది వధూవరులకు బిగ్ డే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగేటప్పుడు తప్పులు జరగడం కామన్. కానీ ఓ నూతన వధువు మాత్రం బ్లండర్ మిస్టేక్ చేసి.. టిక్ టాక్ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాలు షేర్ చేసుకుంది. మార్చిలో పెళ్లి చేసుకున్న ఆమె వివాహ ఆహ్వానపత్రికలో దారుణమైన మిస్టేక్ చేయగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతోంది.

యూఎస్‌కు చెందిన స్క్విడ్.. తన వెడ్డింగ్ ఇన్విటేషన్‌‌లో X-రేటెడ్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన PornHub.comను యాడ్ చేసి అతిథులకు షాక్ ఇచ్చింది. అయితే ఇన్విటేషన్ డిజైన్ చేసే క్రమంలో పోర్న్ వెబ్‌సైట్ నేమ్ పెట్టి.. అధికారిక వెబ్సైటు పేరు చెప్పేవరకు ఇందులో వీడియోస్ చూడండి అంటూ క్లోజ్ ఫ్రెండ్స్‌కి సరదాగా పంపేందుకు చేశాను. కానీ ఫైనల్ ప్రింటింగ్‌కి పంపేముందు ఆ సైట్ నేమ్ తీసేసి అధికారిక వెబ్సైట్ పేరు పెట్టడం మర్చిపోయానని చెప్పుకొచ్చింది. మొత్తానికి తాను చేసిన తప్పుకు తల్లి ఇబ్బంది పడుతుందని తెలిపిన స్క్విడ్.. 'సారీ మామ్. ఐ విల్ ఫిక్స్ ఇట్' అని క్షమాపణలు కోరింది. మొత్తానికి ఈ సంఘటన వెడ్డింగ్ కార్డులో తప్పులు చూడకుండానే తొందరలో ఏ విధంగా బంధువులకు పంపిస్తామో తెలుస్తుండగా.. ప్రూఫ్ రీడ్ అవసరమంటోంది ఈ అమెరికా పిల్ల. ఇకపై ఏ పెళ్లి కూతురు కూడా ఇలాంటి మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ అనుభవాన్ని పంచుకున్నట్లు చెప్పింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

షాకింగ్ సర్వే! పురుషుల కంటే.. మహిళలకే SEX Partners ఎక్కువ!

30 మంది ఒకేసారి.. SEX చేస్తామని అడిగారు: తేజస్వీ

Next Story

Most Viewed