- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాళీ బంద్ ఘర్.. సుభాషిత ఉద్యమం.!
సెల్పీ విత్ డాటర్ ఫౌండేషన్.. మహర్షి దయానంద్ యూనివర్సిటీ సహకారంతో ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాడు

దిశ, ఫీచర్స్: కొందరు నోరు తెరిస్తే గలీజ్ మాటలు మాట్లాడతారు. అవి పిల్లలపై.. మహిళలపై.. సమాజంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అలాంటి ధోరణిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాడు సునీల్ జాగ్లాన్.
గాళీ బంద్ ఘర్ అభియాన్..
చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు. ఊర్ల నుంచి నగరాల వరకు. చదువుకున్న వాళ్లు చదువుకోని వాళ్లు. అందరూ విచ్చలవిడిగా.. స్వేచ్ఛగా మాట్లాడే మాటలు బూతులు. మనం మాట్లాడే ప్రతీ పది మాటల్లో సగం తిట్లే ఉంటాయని చెప్తున్నాడు సునీల్ జాగ్లాన్. అందుకే ఆయన ఎవరి భాష బాధ్యతగా ఉంది.? సంస్కారం గొప్పదా.. భాష గొప్పదా.? అనే అధ్యయనం చేసి ఆ దిశగా అవగాహన కల్పిస్తున్నాడు. 2014 నుంచి 2025 వరకు గాళీ బంద్ ఘర్ అభియాన్ అనే వినూత్న ప్రచారాన్ని చేపట్టాడు. సెల్పీ విత్ డాటర్ ఫౌండేషన్.. మహర్షి దయానంద్ యూనివర్సిటీ సహకారంతో ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాడు.
11 ఏళ్లుగా..
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకరిపై ఒకరు బూతు కామెంట్లు.. హాష్ ట్యాగులు.. ట్రోలింగ్స్. నేడు సమాజం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితిని ముందే అంచనా వేసి 11 ఏళ్లుగా బూతులపై ఉద్యమం చేస్తు్న్నాడు సునీల్. 2014లో బిబిపూర్ చౌపాల్‌లో ఒక చర్చ గొడవగా మారింది. ఉన్నట్టుండీ అందరూ ఒకరిపై ఒకరు బూతులతో యుద్ధం చేస్తున్నారు. ఇదేం గలీజ్ సంతరా బాబూ అనుకొని అప్పుడే డిసైడ్ అయ్యాడు సునీల్. బూతులను ఆపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏండ్ల తరబడి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
70 వేల మందిపై..
సునీల్ 2014లో ‘గాలీ బంధ్ అభియాన్’ అనే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. తిట్లను ఒక సామాజిక సమస్యగా చూశాడతను. అలా 70 వేల మందిని సర్వే చేశాడు. 28 రాష్ట్రాలు.. 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో తాను చేసిన సర్వేలో చాలామంది కుటుంబ సభ్యులను అడ్డగోలుగా తిడతారనే విషయాలను తెలుసుకున్నాడు. అదీ కాకుండా బయటివాళ్లు కూడా ఏదైనా గొడవైతే వాళ్లు వాళ్లు చూసుకోకుండా వాళ్లిండ్లలో ఉన్న తల్లి.. సోదరి.. కూతురుపై పెట్టి తిట్టుకుంటారు. ఇదెక్కడి నీతి.? ఇదేం సంస్కారం.? అని లోతుగా ఆలోచించి దీనిని కట్టడి చేయాలని కంకణం కట్టుకున్నాడు.
బూతుల్లేని సమాజం కోసం..
గాళీ బంద్ ఘర్ కార్యక్రమంలో భాగంగా ఇంటి గోడపై చార్ట్ అంటిస్తారు. రోజూ మాట్లాడే తిట్లు.. బూతులు వాటిమీద ఎక్కిస్తారు. పాఠశాలల్లోనూ ఇదే విధమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా తిట్లను లెక్కించే పద్ధతి వల్ల జనాలకు తాము చేస్తున్న తప్పేంటో తెలుస్తుంది. వారి ఆలోచన విధానంలో మార్పొస్తుందనేది సునీల్ ఉద్దేశం. ఎక్కువగా బూతులు మాట్లాడిన వాళ్లను ఆత్మపరిశీలన చేసుకునేలా ఉంటుంది వీళ్ల కార్యచరణ. అలాంటి వారికి రక్షాబంధన్ సమయంలో రాఖీ కట్టేటప్పుడు ఒట్టేయిస్తారు. “రక్షా బంధన్ కి దోర్.. గాలీ బంధన్ కి ఓర్” అనే ప్రమాణం చేయించి బూతుల్లేని సమాజం కోసం పాటుపడుతున్నాడు.






