Viral video : అసలే ఎండాకాలం.. ఉక్కబోతలు భరించలేక వీళ్లేం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Javid Pasha |   (  Updated:2025-05-21 12:13:52  IST  )

Viral video : అసలే ఎండాకాలం.. ఉక్కబోతలు భరించలేక వీళ్లేం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Viral video : అసలే ఎండాకాలం.. ఉక్కబోతలు భరించలేక వీళ్లేం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, ఫీచర్స్ : అసలే ఎండాకాలం.. ఆపై 6 నుంచి 8 గంటలపాటు విద్యుత్ కోతలు. కనీసం ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా అవకాశంలేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కబోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండవేడికి తట్టుకోలేక ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ కుటుంబం చేసిన పనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు ఆశ్చర్యపోవడంతోపాటు అయ్యో పాపం అంటూ జాలిపడుతున్నారు కూడా. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ సమాచారం ప్రకారం.. అది ఉత్తర ప్రదేశ్‌లోని జాన్సీ ఏరియా. భానుడి భగ భగలతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో, ఆ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 6-8 గంటల పాటు విద్యుత్ కోతలు సర్వ సాధారణంగా మారాయి. ముఖ్యంగా దాటియా గేట్, నయీ బస్తీ, బీకేడీ చౌరాహా వంటి ప్రాంతాల్లోని ప్రజలు నీటి కొరతతో, ఉక్కబోతలతో అవస్థలు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో పలువురు ఎండవేడికి తట్టుకోలేక బ్యాంకులకు సంబంధించిన ఎయిర్ కండిషన్డ్(Air-conditioned) ఏటీఎం సెంటర్లలలో ఆశ్రయం పొందడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబం ఏటీఎంలో చల్లటి ఏసీకి సేదదీరుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు విద్యుత్ కోతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story